సామాన్యుడికి షాక్: పెరిగిన వంటగ్యాస్ ధరలు
ఆయిల్ కంపెనీలు వినియోగదారులకు షాకిచ్చాయి.
ఆయిల్ కంపెనీలు వినియోగదారులకు షాకిచ్చాయి. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ వచ్చిన చమురు సంస్థలు.. తాజాగా వంట గ్యాస్ ధరలను పెంచాయి. సబ్సిడీ, సబ్సిడీయేతర వంటగ్యాస్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీఎల్) ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది.
14.2 కిలోల సబ్సిడీ సిలిండర్‌పై రూ.2.89, సబ్సిడీయేతర సిలిండర్ (వాణిజ్య సిలిండర్)పై రూ.59 పెంచుతున్నట్టు తెలిపింది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడంతో గ్యాస్ ధరలు పెంచినట్లు పేర్కొంది. అలాగే వినియోగదారులకు చెల్లిస్తున్న నగదు బదిలీ మొత్తాన్ని రూ.320.49 నుంచి రూ.376కు పెంచినట్టు తెలిపింది.
కొనసాగుతున్న 'పెట్రో' బాదుడు
పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల నేడూ కొనసాగుతోంది. తాజాగా ఢిల్లీలో లీటర్ పెట్రోల్‌పై 24 పైసలు, డీజిల్‌పై 30 పైసలు పెరిగింది. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.83.73లు ఉండగా డీజిల్ రూ.75.09లు ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్‌పై 24 పైసలు, డీజిల్‌పై 32 పైసలు పెరిగాయి. పెరిగిన ధరల అనంతరం ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.91.08 ఉండగా, డీజిల్ రూ.79.72 గా ఉంది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.88.77 ఉండగా డీజిల్ రూ.81.68గా ఉంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.88 ఉండగా, డీజిల్ ధర రూ.80.57లుగా ఉంది.