LPG cylinder price: వరుసగా రూ. 125 పెరిగిన తర్వాత తొలిసారి తగ్గిన ఎల్పీజీ సిలిండర్ ధరలు
LPG cylinder new prices: ప్రభుత్వరంగ చమురు సంస్థలు ఎల్‌పిజి సిలిండర్ ధరను రూ .10 మేర తగ్గించాయి. ఎల్పీజీ సిలిండర్ ధరల్లో 125 రూపాయల పెంపు అనంతరం ఇలా రూ.10 మేర తగ్గడం వినియోగదారులకు కొంత ఉపశమనం కలిగించే అంశం కానుంది. అయితే ఎల్పీజీ ధరలు ఎలాగైతే పెరుగుతూ వచ్చాయో అలాగే ఈ తగ్గుదల కూడా కొనసాగితేనే వారికి ఇంకొంత ఉపశమనం లభించనుంది.
LPG cylinder new prices: ప్రభుత్వరంగ చమురు సంస్థలు ఎల్‌పిజి సిలిండర్ ధరను రూ .10 మేర తగ్గించాయి. ఎల్పీజీ సిలిండర్ ధరల్లో 125 రూపాయల పెంపు అనంతరం ఇలా రూ.10 మేర తగ్గడం వినియోగదారులకు కొంత ఉపశమనం కలిగించే అంశం కానుంది. అయితే ఎల్పీజీ ధరలు ఎలాగైతే పెరుగుతూ వచ్చాయో అలాగే ఈ తగ్గుదల కూడా కొనసాగితేనే వారికి ఇంకొంత ఉపశమనం లభించనుంది. అంతర్జాతీయ చమురు ధరల్లో తగ్గుదల నమోదవుతుండటమే వంట గ్యాస్ ధర తగ్గుదలకు కారణమైంది. ధరల తగ్గింపు అనంతరం ఏప్రిల్ 1 నంచి 14.2 కిలోల ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్ ధర ప్రస్తుతం ఉన్న రూ .819 నుంచి రూ.809 కి తగ్గనుందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOLC) పేర్కొంది.
ఎల్‌పిజి ధరల పెరుగుదల మొదలైన అనంతరం తొలుత ఫిబ్రవరి 4 న ఎల్పీజీ సిలిండర్‌పై రూ .25 మేర ధరను పెంచారు. తర్వాత ఫిబ్రవరి 15 న రూ .50, ఫిబ్రవరి 25 న, రూ 25 చొప్పున, మరోసారి మార్చి 1 న రూ .25 చొప్పున పెంచారు. దీంతో నెల రోజుల వ్యవధిలోనే ఎల్పీజీ సిలిండర్ ధరలు అమాంతం రూ. 125 మేర పెరిగాయి. ఫిబ్రవరి 4న ఎల్పీజీ సిలిండర్ల ధరలు పెరగడం మొదలైన తర్వాత రూ. 10 మేర తగ్గడం ఇదే తొలిసారి.
"అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల ధరలు నవంబర్ 2020 నుండి స్థిరంగా పెరుగుతూవచ్చాయి. భారతదేశం ఎక్కువగా ముడి చమురుపై దిగుమతిపై ఆధారపడి ఉండటంతో అంతర్జాతీయ ధరల పెరుగుదల భారత్‌లో పెట్రో ఉత్పత్తుల ధరల పెరుగుదలకు కారణం అవుతోందని IOCL వివరించింది.
Also read : Airtel unlimited prepaid plans: ఎయిర్‌టెల్ యూజర్స్‌కి బ్యాడ్ న్యూస్
అయితే, ఐరోపా, ఆసియాలో COVID-19 కేసులు పెరుగుదల, కరోనా వ్యాక్సిన్ దుష్ప్రభావాలపై ఆందోళన వ్యక్తనవుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల ధరలు 2021 మార్చి రెండవ పక్షంలో కొంతమేరకు క్షీణించాయి. ఈ కారణంగానే ఇటీవల దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల్లో (Petrol prices, diesel prices) స్వల్ప తగ్గుదల నమోదైనట్టు IOCL వర్గాలు తెలిపాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook