LPG Gas Cylinder Price Decreased: నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మోడీ ప్రభుత్వం మహిళలకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. సిలిండర్ ధరలను భారీగా తగ్గించి మహిళలకు కానుకగా ఇచ్చింది. ఆ వివరాలు తెలుసుకుందాం.ఉజ్వల పథకం సబ్సిడీని లబ్దిదారులకు మరో ఏడాది పెంచిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో మహిళా దినోత్సవం కానుకగా ఈ ఆఫర్ ను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఈ విషయాన్ని నరేంద్రమోడీ ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ఉమెన్స్ డే సందర్భంగా రూ.100 ధర తగ్గిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. కొన్ని కోట్ల మంది సామాన్యులకు ఇది భారీ ఊరటనిస్తుంది. ప్రత్యేకంగా నారీ శక్తులకు దీంతో లబ్దిపొందుతారు. ఇది పర్యావరణాన్ని కాపాడటంతోపాటు ఎన్నో కుటుంబాల ఆరోగ్యం మెరుగుపడుతుందని మోడీ అన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదీ చదవండి: DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. భారీగా జీతాలు పెంపు 


ఉజ్వల పథకంలో భాగంగా నిన్న కేంద్ర క్యాబినెట్‌ సిలిండర్ పై రూ.300 సబ్సిడీని మరో ఏడాదిపాటు పెంచింది. 14.2 కేజీల సిలిండర్ ఏడాదికి 12 ఈ పథకంలో ఉన్నవారికి లబ్ది అందుతుంది. ఈ పథకం ప్రధాన మంత్రి ఉజ్వల యోజన 2024-25 ఆర్థిక సంవత్సరానికి వర్తిస్తుంది. 2024 మార్చి 1 వరకు 10.27 కోట్లమంది పీఎంయూవై ద్వారా లబ్ది పొందుతున్నారు. ఉజ్వల పథకం ద్వారా కేవలం రూ.600 ధరకే వస్తుంది. ప్రస్తుతం ఈ రూ.100 తగ్గింపుతో సిలిండర్ ధర రూ.500 కే లభిస్తుంది.


ఇదీ చదవండి: ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు హోలీకి ముందు సూపర్ గిఫ్ట్.. సర్‌ప్రైజ్ వచ్చేసిందిగా..


ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు..
ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు సాధారణులకు రూ.1100. గత సంవత్సరం ఆగస్టులో మెడీ ప్రభుత్వం రూ.200 ధర తగ్గించిన విషయం తెలిసిందే. దీంతో సిలిండర్ ధర సామాన్యులకు రూ.900 అటూ ఇటూగా ప్రాంతీయ ట్యాక్సులను అనుసరించి లభిస్తుంది.  ఇప్పుడు మరో రూ.100 డిస్కౌంట్ ప్రకటించడంతో రూ.800 కు లభిస్తుంది.







స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి