Lunar Eclipse 2021 Lunar Eclipse Today Will Be The Longest in 580 Years Longest partial lunar eclipse since 1440 : నవంబర్ 19న అంటే నేడు.. చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కూడా కనిపించనుంది. 580 ఏళ్ల తర్వాత ఈ సుదీర్ఘమైన పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతోంది. చంద్ర గ్రహణం వ్యవధి మూడు గంటల 28 నిమిషాల 24 సెకన్లు ఉంటుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చివరిసారిగా 1440 ఫిబ్రవరి 18న ఇంత సుదీర్ఘమైన పాక్షిక చంద్రగ్రహణం (Lunar Eclipse) ఏర్పడింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read :మిస్టర్ 360 షాకింగ్ నిర్ణయం: అన్ని ఫార్మెట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన ఏబీడివిలియర్స్


ఈ చంద్రగ్రహణం ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఈశాన్య రాష్ట్రాల్లో కనిపిస్తుంది. చంద్రునికి సూర్యునికి మధ్యగా సరళరేఖ మార్గంలో భూమి (earth0 వచ్చిన సమయంలో సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డుగా ఉంటుంది. అలా చంద్రగ్రహణం (Lunar Eclipse) ఏర్పడుతుంది. 


ఇక ఈ ఏడాది చంద్ర గ్రహణాల్లో ఇది చివరిది. ఇవాళ మధ్యాహ్నం ఏర్పడే ఈ గ్రహణం.. సాయంత్రం వరకు ఉంటుంది. ఇలాంటి  సుదీర్ఘ పాక్షిక చంద్రగ్రహణం గతంలో 1440ల్లో ఏర్పడింది. మళ్లీ 2489 అక్టోబర్‌ 9న ఏర్పడనుంది.


Also Read :మూడు నూతన సాగు చట్టాలను ఉపసంహరించుకుంటున్నాం': ప్రధాని మోదీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook