Madda Ram Kawasi thanks to sachin Tendulkar : సచిన్ టెండూల్కర్ కు థ్యాంక్స్
![Madda Ram Kawasi thanks to sachin Tendulkar : సచిన్ టెండూల్కర్ కు థ్యాంక్స్ Madda Ram Kawasi thanks to sachin Tendulkar : సచిన్ టెండూల్కర్ కు థ్యాంక్స్](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/styles/zm_500x286/public/2020/01/03/180861-madda-ram.jpg?itok=xsTI7WW_)
మద్ద రామ్ కవాసీ గుర్తున్నాడా.. ! ఈ ఫోటోలో చూస్తే మీరు గుర్తుపట్టవచ్చు. అవును .. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ .. కొత్త ఏడాది శుభాకాంక్షలతో ట్వీట్ చేసిన ఇన్సిపిరేషన్ వీడియోలో చిన్నారి బుడతడు ఇతడే. మద్ద రామ్ కవాసీ .. ఛత్తీస్ గఢ్ రాష్ట్రానికి చెందిన నివాసి. దివ్యాంగుడైన అతడు .. స్థానికంగా ఉన్న స్కూలులో క్రికెట్ ఆడుతున్నాడు.
మద్ద రామ్ కవాసీ గుర్తున్నాడా.. ! ఈ ఫోటోలో చూస్తే మీరు గుర్తుపట్టవచ్చు. అవును .. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ .. కొత్త ఏడాది శుభాకాంక్షలతో ట్వీట్ చేసిన ఇన్సిపిరేషన్ వీడియోలో చిన్నారి బుడతడు ఇతడే. మద్ద రామ్ కవాసీ .. ఛత్తీస్ గఢ్ రాష్ట్రానికి చెందిన నివాసి. దివ్యాంగుడైన అతడు .. స్థానికంగా ఉన్న స్కూలులో క్రికెట్ ఆడుతున్నాడు. ఈ చిన్నారి దివ్యాంగుడైనప్పటికీ . . క్రికెట్ మీద ఉన్న ప్రేమతో రెండేళ్ల నుంచి ఆడుతున్నాడు. అతను క్రికెట్ ఆడుతున్నప్పుడు ఓ గుర్తు తెలియని వ్యక్తి మొబైల్ ద్వారా చిత్రీకరించాడు. ఆ వీడియోను సోషల్ మీడియా ద్వారా గుర్తించిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ . . తన ట్విట్టర్ లో పోస్టు చేశారు. ఈ బాలుడిని ప్రేరణగా తీసుకుని .. కొత్త ఏడాదిలో అందరూ విజయం సాధించాలని సచిన్ కోరుకున్నారు. దీంతో ఈ బాలుడి గురించి అందరికీ తెలిసింది.
నా వీడియో షేర్ చేసినందుకు ధన్యవాదాలు
సచిన్ టెండూల్కర్ షేర్ చేసిన వీడియో .. వైరల్ కావడంతో .. అంతా మద్ద రామ్ కవాసీ గురించి వాకబు చేయడం మొదలు పెట్టారు. ఓ మీడియా సంస్థ అతన్ని గుర్తించింది. సచిన్ టెండూల్కర్ షేర్ చేసిన వీడియో గురించి ఆ బాలుడికి ఇప్పటి వరకు తెలియకపోవడం విశేషం. ఐతే తన వీడియోను క్రికెట్ దేవుడు .. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ షేర్ చేశారన్న విషయం తెలుసుకున్న మద్ద రామ్ కవాసీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఉబ్బి తబ్బిబ్బైన అతడు . . సచిన్ టెండూల్కర్ కు ధన్యవాదాలు చెప్పాడు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..