Congress Manifesto For MP Assembly Elections 2023: మధ్యప్రదేశ్‌ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ మంగళవారం తన మేనిఫెస్టోను విడుదల చేసింది. అన్ని వర్గాలకు ఆకట్టుకునేలా మేనిఫెస్టోను రూపొందించింది. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు కమల్‌నాథ్ మేనిఫెస్టోను విడుదల చేశారు. 106 పేజీల మేనిఫెస్టోలో 59 హామీలు ఉన్నాయి. రైతులకు గోధుమలకు క్వింటాల్‌కు రూ.2600 ధర ఇస్తామని ప్రకటించింది. వరి ఎమ్మెస్పీ క్వింటాల్‌కు రూ.3 వేలకి పెంచుతామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తరువాత మధ్యప్రదేశ్‌కు ఐపీఎల్‌ టీమ్‌ను ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. అదేవిధంగా రూ.500 గ్యాస్ సిలిండర్లు అందిస్తామని తెలిపింది. రాష్ట్ర ప్రజలందరికీ రూ.25 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తామని హామీల వర్షం కురిపించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కాంగ్రెస్ హామీలు ఇవే..


==> ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్
==> రాష్ట్రంలో క్రికెట్, క్రీడలను ప్రోత్సహించడానికి ఐపీఎల్ టీమ్‌ ఏర్పాటు చేయడం
==> రూ.2 లక్షల వరకు వ్యవసాయ రుణాలను మాఫీ  
==> మహిళలకు నెలకు రూ.1,500 సాయం 
==> 500 రూపాయలకు ఎల్‌పీజీ సిలిండర్లు, 
==> ఉచిత పాఠశాల విద్య, పాత పెన్షన్ పథకం 
==> యువతకు నిరుద్యోగ భృతి రెండు సంవత్సరాల పాటు నెలకు రూ.1,500 నుంచి రూ.3,000 వరకు.
==> రూ.25 లక్షల ఆరోగ్య బీమా, రూ.10 లక్షలు ప్రమాద బీమా


మేనిఫెస్టోను విడుదల చేస్తూ కమల్ నాథ్ మాట్లాడారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రజలందరికీ రూ.25 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇందులో రూ.10 లక్షల ప్రమాద బీమా కూడా ఉంటుందన్నారు. మధ్యప్రదేశ్ నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) జట్టు రూపొందించేందుకు ఉంటుందని చెప్పాడు. రూ.2 లక్షల వరకు వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని, మహిళలకు నెలకు రూ.1,500 సాయం చేస్తామని ప్రకటించారు.


230 మంది సభ్యులున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీకి నవంబర్ 17న ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే తొలి విడతగా 144 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. కమల్‌నాథ్‌ను ఛింద్వాడా అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. త్వరలోనే రెండో జాబితాను కాంగ్రెస్ విడుదల చేయనుంది. 


Also Read: Bathukamma Festival Special: బతుకమ్మ పండుగ స్పెషల్.. ఈ పూలలో దాగిన ఔషధ గుణాలు ఎన్నో..!  


Also Read: TCS Recruitment: టీసీఎస్ కంపెనీ గుడ్‌న్యూస్.. 40 వేల మంది నియామకాలకు రెడీ..!  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి