భోపాల్: త్వరలో పెళ్లి చేసుకోబోతున్న పాతికేళ్ల యువకుడి మర్మంగాన్ని కోసేశారు. మధ్యప్రదేశ్ లో మల విసర్జనకు వెళ్లిన యువకుడిపై దాడి జరిగిన ఘటన అందరినీ విస్తుపోయేలా చేసింది. ఈ ఘటన మెరేనా జిల్లాలో చోటుచేసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాల్లోకి వెళితే.. గురువారం 25 ఏళ్ల యువకుడు కాలువ పక్కన మల విసర్జనకు వెళ్లాడు. అక్కడ కొందరు దుండగులు అతడిపై దాడి చేశారు. ఈ దాడిలో అతడి మర్మంగాన్ని కోసి తీసుకెళ్లారు. రక్తపు మడుగులో పడి ఉన్న అతన్ని చూసి గ్రామస్తులు ఆసుపత్రికి తరలించారు. కుటుంబసభ్యులకు కబురు పంపారు. విషయం తెలుసుకొని ఇరు కుటుంబాలు కన్నీరుమున్నీరు అవుతున్నారు.


ప్రస్తుతం ఆ యువకుడు మాట్లాడే స్థితిలో లేడని.. వివరాలు సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు. యువకుడి మర్మాంగం గురించి నేరం జరిగిన స్థలంలో వెతికినా లభ్యం కాలేదన్నారు. దుండగుల కోసం గాలిస్తున్నాము. దాడికి కారణాలేంటో తెలియరాలేదు. ఎవరిపైనా అనుమానాలు లేవని కుటుంబ సభ్యులు చెప్పారు.  పెళ్లి కూతురు, ప్రేమ వ్యవహారం, గొడవలు, కుటుంబ కలహాలు లాంటి కోణంలో కూడా విచారణ జరుపుతున్నామన్నారు.