Madhya Pradesh: ఉధంపూర్-దుర్గ్ ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలు ..రెండు బోగీలు దగ్ధం..!
Madhya Pradesh: ఉధంపూర్-దుర్గ్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగి..రెండు ఏసీ బోగీలు కాలిపోయాయి . ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని మెురేనా ప్రాంతంలో జరిగింది.
Fire Accident in Train: మధ్యప్రదేశ్ లో మెురేనా(Morena) ప్రాంతంలో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. మొరేనా, ధోల్‌పుర్‌కు మధ్యలో ఉండే.. హేతమ్‌పుర్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరిన కొద్ది సమయానికే ఉధంపూర్-దుర్గ్ ఎక్స్‌ప్రెస్(Udhampur-Durg express)లో మంటలు చెలరేగాయి. ఎక్స్‌ప్రెస్‌లోని ఏ1, ఏ2 బోగీల్లో పెద్దఎత్తున మంటలు వ్యాపించాయి.
ప్రయాణికులను ఖాళీ చేయించడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే సిబ్బంది, అధికారులు మంటలు వ్యాపించిన బోగీలను వేరు చేశారు. ప్రమాదం జరిగిన మార్గంలో రైల్వే అధికారులు రైళ్ల రాకపోకలను నిలిపివేశారు .ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు.
Also Read: Delhi Metro’s driverless train : ఢిల్లీలో పింక్‌లైన్‌పై డ్రైవర్‌లెస్ మెట్రో పరుగులు
నాలుగు బోగీల్లో మంటలు(fire in train) అలుముకున్నాయని స్థానికులు చెప్పారు. అయితే, రెండు బోగీల్లోనే మంటలు చెలరేగినట్లు సరాయ్చోలా పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్ రిషికేశ్ శర్మ స్పష్టం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook