Train Accident: మధ్యప్రదేశ్ షాహ్‌డోల్ జిల్లాలో ఇవాళ రెండు రైళ్లు అత్యంత ఘోరంగా ఢీ కొన్నాయి. రైళ్ల ముందు భాగాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. లోకో పైలట్ మృతి చెందగా కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. 10 రైళ్లు రద్జయ్యాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ దుర్ఘటన షాహ్‌డోల్ జిల్లాలో బిలాస్‌పూర్-కట్నీ రైలు మార్గంపై జరిగింది. రెండు గూడ్స్ రైళ్లు ఒకదానికొకటి తీవ్రంగా ఢీ కొన్నాయి. గూడ్స్ ఇంజన్ సహా 8 కోచ్‌లు పట్టాలు తప్పాయి. ఈ రైలు ప్రమాదంలో లోకో పైలట్ మరణించగా, ఆరుగురు సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సింహపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉదయం 6.50 గంటలకు జరిగింది. బిలాస్‌పూర్ రైల్వే డివిజన్ పరిధిలోని పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కల్గింది. ప్రమాదం తరువాత ధ్వంసమైన ఇంజన్‌లోంచి పెద్దఎత్తున మంటలు వ్యాపించాయి. 


మధ్యప్రదేశ్-ఛత్తీస్‌గఢ్ మార్గమధ్యలో ఉంది కట్నీ ప్రాంతం. సిగ్నల్ ఓవర్ టేక్ కారణంగా ఈ రైలు ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. దాదాపు 10 రైళ్లు రద్దయ్యాయి. 


Also read: Summer Heatwave Warning: మండుతున్న ఎండలు.. పనివేళల మార్పునకు రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook