Madhya Pradesh: బాయ్‌ఫ్రెండ్‌ మాట్లాడటం లేదని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్‌ చింద్వారా(Chhindwara)కు చెందిన యువతి...సరణికి  చెందిన యువకుడితో ప్రేమలో పడింది. కొన్ని కారణాల వల్ల బాయ్ ఫ్రెండ్ పుట్టినరోజు(Boy Friend birthday)కి  ఆ యువతి విషెస్ చెప్పలేదు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం(Fight) చోటుచేసుకుంది. గొడవ తర్వాత ఆ యువకుడు ఆమెతో మాట్లాడటం మానేశాడు. యువతి ఎన్ని రకాలుగా ప్రయత్నించినా.. అతడు ఆమెతో మాట్లాడలేదు. ఈ క్రమంలో సదరు మహిళ(Woman) పోలీసులను ఆశ్రయించింది. గత కొన్ని రోజులుగా బాయ్‌ఫ్రెండ్‌ తనతో మాట్లాడటం లేదని.. కావాలనే తనను దూరం పెడుతున్నానడి ఆరోపించింది.


Also Read: షార్ట్స్ ధరించినందుకు బ్యాంకు లోపలికి నో ఎంట్రీ... కోల్‌కతా యువకుడికి చేదు అనుభవం...


ఈ క్రమంలో పోలీసులు(Police) ఇద్దరిని స్టేషన్‌కు పిలిపించి.. కొన్ని గంటల పాటు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. అనంతరం ఇంట్లో వారికి వీరి విషయం చెప్పి.. పెళ్లి చేసుకోవాల్సిందిగా సూచించారు. పోలీసులు సూచన మేరకు తమ ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పారు సదరు లవర్స్‌(Lovers). ఇరువైపులా పెద్దలు వారికి పెళ్లికి అంగీకరించడమే కాక.. ఆర్యసమాజ్‌లో వివాహం చేశారు. అలా వారి ప్రేమ కథ సుఖాంతం అయ్యింది. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook