Jyotiraditya Scindia: భోపాల్: మధ్యప్రదేశ్‌లో నూతన కేబినెట్ ఏర్పడింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ (CM Shivraj Singh Chouhan ) చౌహన్ నేతృత్వంలోని కేబినెట్‌లో 28 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. శివరాజ్ సింగ్ చౌహన్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగోసారి మార్చి 23న ప్రమాణస్వీకారం చేయగా.. అదే రోజు ఆయనతో పాటు ఐదుగురు నేతలు మాత్రమే మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత అనేక కారణాలతో వాయిదా పడుతూ వస్తోన్న కేబినెట్ విస్తరణ ఈరోజు ( MP cabinet expansion ) పూర్తయింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మధ్యప్రదేశ్ కేబినెట్‌లో మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారిలో గోపాల్ భార్గవ, విజయ్ షా, జగదీష్ దేవ్దా, బిషాహులాల్ సింగ్, జ్యోతిరాదిత్య సిందియా అత్త యశోధరా రాజే సిందియా ( Yashodhara Raje Scindia ), భూపేంద్ర సింగ్, అడాల్ సింగ్ కన్సానా, బ్రిజేంద్ర ప్రతాప్ సింగ్, విశ్వాస్ సారంగ్, ఇమర్తి దేవి, డా ప్రభురాం చౌదరి, మహేంద్ర సింగ్ సిసోడియా, ప్రద్యుమ్న సింగ్ తోమర్, ప్రేమ్ సింగ్ పటేల్, ఓం ప్రకాశ్ సక్లెచ, ఉషా థాకూర్, అర్వింద్ భదోరియా, డా మోహన్ యాదవ్, హర్దీప్ సింగ్ ధంగ్, రాజ్ వర్ధన్ సింగ్, భరత్ సింగ్ కుశ్వాహ, ఇందర్ సింగ్ పర్మర్, రామ్ ఖెల్వన్ పటేల్, రాంకిషోర్ కన్వరె, బ్రిజెంద్ర సింగ్ యాదవ్, గిరిరాజ్ ధండోతియా, సురేష్ ధాకడ్, ఓపిఎస్ భదోరియా ఉన్నారు.  


శివరాజ్ సింగ్ చౌహన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడానికి ముందు మధ్యప్రదేశ్‌లో 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కమల్ నాథ్ సర్కారుకు ( Kamal Nath govt ) తిరుగుబాటు జండా ఎగరేసిన అనంతరం అక్కడ కాంగ్రెస్ సర్కార్ కుప్పకూలిన సంగతి తెలిసిందే. అలా కాంగ్రెస్‌కి ఎదురుతిరిగిన ఎమ్మెల్యేల బృందాన్ని ముందుడి నడిపించిన జ్యోతిరాదిత్య సిందియా ఆ తర్వాత బీజేపీలో చేరి బీజేపి సర్కారు ఏర్పాటుకు సహకరించారు. కాంగ్రెస్ పార్టీతో అభివృద్ధి సాధ్యపడేలా లేదనే అసంతృప్తితో ఆ పార్టీ నుంచి బయటికొచ్చిన జ్యోతిరాదిత్య సిందియా ఆ తర్వాత బీజేపీలో చేరి పార్టీ అధిష్టానానికి చేరువయ్యారు. 


మధ్యప్రదేశ్ కేబినెట్‌లో చోటు దక్కించుకున్న కొత్త మంత్రులలో జ్యోతిరాదిత్య సిందియా మద్దతుదారులకు కూడా ప్రాధాన్యత లభించింది. జ్యోతిరాదిత్య సిందియా సూచించిన నేతలకు మధ్యప్రదేశ్ కేబినెట్‌లో చోటు లభించింది.