చెన్నై: నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రెన్స్ టెస్ట్(నీట్) పరీక్షను తమిళ భాషలో రాసిన విద్యార్థులకు గ్రేస్ మార్కులు కలపాలని మద్రాస్ హైకోర్టులోని మధురై బెంచ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ)ని ఆదేశించింది. విద్యార్థులకు 196 గ్రేస్ మార్కులను కలపాలని కోర్టు తన తీర్పులో పేర్కొంది. మరో రెండు వారాల్లోగా సవరించిన ర్యాంకులతో నీట్ లిస్టును విడుదల చేయాలని కోర్టు సీబీఎస్‌ఈని ఆదేశించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

త‌మిళం భాష‌లో వైద్య ప‌రీక్ష కోసం త‌యారు చేసిన ప్రశ్నాప‌త్రంలో 49 ప్రశ్నలకు అనువాదాలు (ట్రాన్స్‌లేషన్) త‌ప్పుగా దొర్లాయి. త‌ర్జుమాలో పొర‌పాట్లు జ‌రిగిన‌ట్లు అధికారులు గుర్తించి మ‌ద్రాస్ హైకోర్టులో పిల్ వేశారు. తమిళ ప్రశ్నాపత్రంలో దొర్లిన పొరపాట్ల కారణంగా తమిళ మీడియం విద్యార్థులు నష్టపోయారని, మార్కులను కలిపి కొత్త ర్యాంకులను సీబీఎస్ఈ విడుదల చేయాలని పిల్‌లో పేర్కొన్నారు. పిటిషనర్ సీపీఐ(ఎం) నేత టి.రంగరాజన్ ఇంగ్లీష్ నుంచి తమిళ భాషలోకి తప్పుగా తర్జుమాచేసిన ప్రశ్నలకు సంబంధించిన కీవర్డ్స్‌ను కోర్టుకు సమర్పించారు. విచారించిన మదురై బెంచ్ 49 ప్రశ్నలకు గానూ.. ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులు చొప్పున మొత్తం 196 మార్కులు కలపాలని సీబీఎస్ఈని ఆదేశించింది.


[[{"fid":"171270","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"'వారికి నీట్‌లో 196 మార్కులు కలపండి': హైకోర్టు","field_file_image_title_text[und][0][value]":"'వారికి నీట్‌లో 196 మార్కులు కలపండి': హైకోర్టు"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"'వారికి నీట్‌లో 196 మార్కులు కలపండి': హైకోర్టు","field_file_image_title_text[und][0][value]":"'వారికి నీట్‌లో 196 మార్కులు కలపండి': హైకోర్టు"}},"link_text":false,"attributes":{"alt":"'వారికి నీట్‌లో 196 మార్కులు కలపండి': హైకోర్టు","title":"'వారికి నీట్‌లో 196 మార్కులు కలపండి': హైకోర్టు","style":"float: left;","class":"media-element file-default","data-delta":"1"}}]]జూలై 6న మద్రాసు హైకోర్టు నీట్‌లో తర్జుమా తప్పులు దొర్లడంపై విమర్శించింది. దీనిపై కోర్టులో పిల్ దాఖలు చేశారని తెలిసినప్పటికీ, సీబీఎస్ఈ ఫలితాలను విడుదల చేసింది. "ఎందుకు అలా చేశారు?" అని కోర్టు అడిగింది. సీబీఎస్ఈ ఇచ్చిన నివేదికను ప్రస్తావిస్తూ, ప్రశ్నలకు సరైన సమాధానాలను మీరు ఎలా నిర్ణయిస్తారు. మెజారిటీ అభిప్రాయాల ఆధారంగానా? అని ప్రశ్నించింది. సైన్స్ పాఠ్యాంశాలలోని ఇంగ్లీష్ పదాలను తమిళంలో తర్జుమా చేయడానికి సాధన చేశారా? లేదా? అనే అంశంపై అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు ఇదివరకే సీబీఎస్ఈని సూచించింది.