Madras high court serious on sadhguru: ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్‌పై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో సద్దురుకు ప్రపంచ మంతట కూడా కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్న సంగతి తెలిసిందే. ఆయన మోటివేషన్స్ లను ఎంతో మంది యువత పాటిస్తుంటారు. ఈ క్రమంలో..ఇటీవల తమిళనాడుకు చెందిన  రిటైర్డ్ ప్రొఫెసర్ చేసిన ఆరోపణలు పెనుదుమారంగా మారాయి.  ఆయన ఇద్దరి కూతుళ్లు.. సద్గురును కలిసిన తర్వాత.. ఎట్టి పరిస్థితుల్లోను పెళ్లిచేసుకొమని తెల్చిచెప్పారని ఆయన చెప్పుకొచ్చారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంతటితో ఆగకుండా.. ఇంటిని వదిలేసి ఇషా ఫౌండేషన్ లోనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో యువతుల తండ్రి..  రిటైర్డ్ ప్రొఫెసర్  జగ్గీపై మద్రాస్ హైకోర్టులో పిటిషన్ సైతం దాఖలు చేశారు. తమ ఇద్దరు కూతుళ్లకు లేని పోనీవి చెప్పి పెళ్లికి దూరంచేసి, సన్యాసం తీసుకునేలా చేశాడని పిటిషన్ వేశాడు. మరోవైపు ఆయన కూతురికి మాత్రం .. పెళ్లి చేసి పంపించారంటూ కూడా ఆ పిటిషన్ లో పేర్కొన్నాడు.


దీనిపై ఈరోజు విచారణ జరిగిన మద్రాస్ హైకోర్టు.. మీ కూతుళ్లకు పెళ్లా.. ఇతర మహిళలకు సన్యాసమా.. అంటూ కూడా  ఘాటు వ్యాఖ్యలు చేసింది. అయితే.. సదరు బాధితుడి కూతుళ్లు మాత్రం.. తాము మేజర్ల మని తమ ఇష్టప్రకారమే ఇషాలో చేరామని చెప్పుకొచ్చారు. అదే విధంగా.. ఇషా ఫౌండేషన్ పై గతంలో నమోదైన అత్యాచారం, కేసులపై విచారణ జరపాలని కూడా పిటిషన్ వేశాడు.


Read more: IRCTC: ప్రయాణికులు ఎగిరి గంతేసే శుభవార్త.. దసరా, దీపావళి నేపథ్యంలో అదరిపోయే ప్రకటన చేసిన కేంద్ర మంత్రి.. డిటెయిల్స్..


మరోవైపు ఈ ఘటనలో.. తమకు మరిన్ని సందేహలు ఉన్నాయని కూడా న్యాయస్థానం పేర్కొంది. అదే విధంగా ఇషాపై నమోదైన క్రిమినల్ కేసుల వివరాలను సబ్మిట్ చేయాలని తమిళనాడు సర్కారుకు ఆదేశాలు జారీ చేసింది. అనంతరం కేసును అక్టోబరు 4 కు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇషాఫౌండేషన్ పై వచ్చిన ఆరోపణలు కాస్త వార్తలలో నిలిచాయి.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.