COVID New guidelines for people: దేశంలో కరోనా కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ భయాలు వెంటాడుతున్న (Omicron scare in India) నేపథ్యంలో ఈ ఆంక్షలను మరింత కఠినతరం చేస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తమిళనాడులోని మధురై జిల్లాలో కొత్త రూల్స్ (COVID rules in Madurai) అమలులోకి వచ్చాయి. ఇకపై జిల్లా వ్యాప్తంగా వ్యాక్సిన్​ తీసుకోని వారు జన సముధాయాల్లోకి  వచ్చేందుకు అనుమతి లేదని (Na vaccination No entry) ఆ జిల్లా కలెక్టర్​ అనీశ్ శేఖర్​ స్పష్టం చేశారు.


కొత్త రూల్స్ ఇలా..


జిల్లా ప్రజలు వ్యాక్సిన్ తీసుకోకుంటే.. రేషన్ షాపులు మొదలుకుని, సూపర్​ మార్కెట్లు, షాపింగ్​ మాల్స్, బట్టల దుకాణాలు, ఫంక్షన్ హాళ్లు, బ్యాంకులు, మద్యం షాపులు సహా అన్ని రకాల వ్యాపార సముదాయాల్లోకి అనుమతి ఉండదని తెల్చి చెప్పారు జిల్లా కలెక్టర్​.


నిజానికి గత వారమే ఈ నిబంధనలపై ప్రకటన చేశారు కలెక్టర్. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకునేందుకు వారం రోజుల గడువు ఇచ్చారు. గడువు ముగిసిన నేపథ్యంలో చెప్పినట్లుగానే కఠిన నిబంధనలను అమలులోకి తెచ్చారు.


తమిళనాడు వ్యాప్తంగా కూడా కఠిన కొవిడ్ నిబంధనలు అమలవుతున్నాయి. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా కూడా ఇలాంటి రూల్స్ అమలయ్యే అవకాశాలు ఉన్నాయి.


కర్ణాటకలోనూ..


కర్ణాటకలో ఇప్పటికే కఠిన కొవిడ్ రూల్స్ అమలవుతున్నాయి. బెంగళూరు సహా ఇతర ప్రధాన నగరాల్లో వ్యాక్సిన్ తీసుకుంటేనే షాపింగ్ మాల్స్,  సినిమా హాళ్లు వంటి వాటిలోకి అనుమతినిస్తున్నారు. ఆ రాష్ట్రంలోనే తొలుత రెండు ఒమిక్రాన్​ కేసులు బయటపడిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది కర్ణాటక ప్రభుత్వం.
ఇక తెలంగాణలో మాస్క్ ధరించకుండా బయటకు వస్తే రూ.వెయ్యి జరిమానా విధిస్తున్నారు అధికారులు.


దేశవ్యాప్తంగా ఇతర నగరాల్లో సైతం కొవిడ్ రూల్స్ కఠినంగా అమలవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా మాస్క్ తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే.


Also read: Omicron cases: ఒక్క రోజులో 7 ఒమిక్రాన్ కేసులు- మూడేళ్ల చిన్నారికీ పాజిటివ్​


Also read: BJP MLA Jailed: భారతీయ జనతా పార్టీ MLAకి ఐదేళ్ల జైలుశిక్ష!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook