శ్రీదేవి మరణం వెనుక దావూద్ హస్తం..?
శ్రీదేవి మరణంపై బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రమణియన్ స్వామి సంచలన ఆరోపణలు చేశారు.
శ్రీదేవి మరణంపై బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రమణియన్ స్వామి సంచలన ఆరోపణలు చేశారు. శ్రీదేవిది సహజ మరణం కాదని, అది హత్యేనని, ఆమె మృతి వెనుక మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం హస్తం ఉందని సుబ్రమణియన్ అనుమానం వ్యక్తం చేశారు. సినిమా స్టార్లతో దావుద్‌కు ఉన్న సంబంధాలపై కూడా విచారణ జరిపించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
శ్రీదేవి మృతి చెందిన రోజు రాత్రి హోటల్ రూంకి ఎవరు వెళ్లారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. శ్రీదేవి ఉన్న హోటల్ రూంకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు బహిర్గతం చేయటం లేదని సుబ్రమణియన్ ప్రశ్నించారు. ప్రాసిక్యూషన్ ఏమి మాట్లాడుతుందో వేచి చూద్దాం.. మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం స్థిరంగా ఉండదన్నారు. శ్రీదేవి హార్డ్ లిక్కర్ తాగలేనప్పుడు.. ఆమె శరీరంలోకి అది ఎలా వచ్చిందని అనుమానం వ్యక్తంచేశారు.