Maharashtra BJP leader slapped for post against Sharad Pawar: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్‌పై (Sharad Pawar) అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గానూ.. మహారాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి వినాయక్ అంబేకర్‌ను (Vinayak Ambekar) ఆ పార్టీ కార్యకర్తలు చెంపదెబ్బ కొట్టారు. ఈ దాడికి సంబంధించిన వీడియోను రాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"మహారాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి వినాయక్ అంబేకర్‌పై ఎన్‌సీపీ గూండాలు దాడి చేశారు. బీజేపీ తరపున నేను ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ ఎన్‌సీపీ గూండాలపై వెంటనే చర్యలు తీసుకోవాలి'' అంటూ చంద్రకాంత్ పాటిల్  (Chandrakant Patil) ట్వీట్ చేశారు. డెస్క్ వద్ద కూర్చున్న అంబేకర్‌తో కొంతమంది వ్యక్తులు వాగ్వాదానికి దిగారు. ఈ మధ్యలో ఓ వ్యక్తి అంబేకర్‌ను చెంపదెబ్బ కొట్టాడు. ఈ దృశ్యాలు వీడియోలో స్పష్టంగా రికార్డు అయ్యాయి. 



శనివారం, పవార్‌పై అభ్యంతరకరమైన పోస్ట్‌లను షేర్ చేసినందుకు మరాఠీ నటి కేతకి చితాలే (Marathi actor Ketaki Chitale) మరియు విద్యార్థి నిఖిల్ భామ్రేను అరెస్టు చేశారు. ఈ రోజు మహారాష్ట్రలోని కోర్టు.. నటికి మే 18 వరకు పోలీసు కస్టడీకి విధించింది. చితాలేను థానే పోలీసులు అరెస్టు చేయగా, మిస్టర్ భామ్రేను నాసిక్‌లో అరెస్టు చేశారు. ప్రముఖ రాజకీయ నేత శరద్ పవార్ పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అన్నారు.


Also Read: Manik saha tripura New CM: త్రిపుర కొత్త సీఎంగా మాణిక్ సాహా.. ఎవరాయన ? 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook