Maharashtra Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు వైద్య విద్యార్థులు మృతి.. మృతుల్లో ఎమ్మెల్యే కుమారుడు..!
Road Accident: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వంతెనపై నుంచి కారు కిందపడిన ఘటనలో ఏడుగురు వైద్య విద్యార్థులు మృతి చెందారు. ఇందులో ఓ భాజపా ఎమ్మెల్యే కుమారుడు కూడా ఉన్నాడు.
Maharashtra Road Accident: మహారాష్ట్రలో వార్థా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident in Maharashtra) జరిగింది. వంతెన పైనుంచి కారు కింద పడి ఏడుగురు వైద్య విద్యార్థులు (7 medical students) దుర్మరణం చెందారు. మృతుల్లో తిరోడా ఎమ్మెల్యే విజయ్ రహంగ్డాలే కుమారుడు ఆవిష్కార్ కూడా ఉన్నారు. సోమవారం అర్ధరాత్రి ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50వేల చొప్పున పరిహారం ప్రకటించారు.
అసలేం జరిగిందంటే...
పోలీసుల చెప్పిన ప్రకారం.. సావంగిలోని మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ (MBBS Students) చదువుతున్న ఏడుగురు విద్యార్థులు నిన్న రాత్రి 11.30 గంటల ప్రాంతంలో దేవ్లీ నుంచి వార్ధా వెళ్తుండగా.. సెల్సురా వంతెనపై ఓ జంతువు అడ్డం వచ్చింది. ఆ యానిమల్ ను తప్పించబోయి వీరు ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి వంతెనపై నుంచి కాలువలో పడింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయింది. కారులో వారంతా అక్కడికక్కడే మృతిచెందినట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read: COVID-19 Cases: అప్పటికల్లా కొవిడ్ కేసుల తగ్గుముఖం, థర్డ్ వేవ్ ప్రభావం తగ్గుతుందట!
మృతుల్లో గోండ్యా జిల్లా తిరోడా ఎమ్మెల్యే విజయ్ రహంగ్డాలే కుమారుడు ఆవిష్కర్ (Vijay Rahangdale’s son Avishkar ) సహా ఏడుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. సావంగి మెడికల్ కాలేజీలో ఆవిష్కర్ ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఇతర బాధితులను నీరజ్ చౌహాన్, నితేష్ సింగ్, వివేక్ నందన్, ప్రత్యూష్ సింగ్, శుభమ్ జైస్వాల్, పవన్ శక్తిగా గుర్తించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook