Maharashtra: ఓయో రూమ్ లో షాకింగ్ ఘటన.. ప్రియురాలిని మాట్లాకుందామని పిలిచి.. ఆ తర్వాత..
Crime News: పింప్రి చించ్‌వాడ్‌లోని హింజేవారీ ప్రాంతంలోని ఓయో హోటల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. కాల్పుల ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హోటల్‌కు చేరుకుని మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Infosys Techie Killed: కొందరు యువత అమ్మాయిల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. ఫ్రెండ్లీగా మాట్లాడిన కూడా తనను ప్రేమిస్తుందని, ఏదేదో ఊహించుకుంటారు. ఈ క్రమంలోనే అమ్మాయిలతో లవ్ ప్రపోజ్ చేస్తుంటారు. కొందరు అమ్మాయిలు ఇలాంటి వారిని దూరం పెడుతుంటారు. దీంతో అలాంటి వారిపై కోపం పెంచుకుని భౌతిక దాడులకు దిగడం, హత్యలు చేయడానికి కూడా ప్లాన్ లు చేస్తుంటారు. అచ్చం ఇలాంటి ఘటన మహారాష్ట్రలోని పూణెలో వెలుగు చూసింది.
మహారాష్ట్రలోని పూణెకు సమీపంలోని పింప్రి చించ్‌వాడ్‌లోని హింజేవారీ ప్రాంతంలోని ఓయో హోటల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇన్ఫోసిస్‌లో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను, ఆమె ప్రియుడు శనివారం రాత్రి పూణే శివార్లలోని ఓ హోటల్‌లో కాల్చి చంపాడు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడి అరెస్ట్ చేసి పిస్టల్ ను స్వాధీనం చేసుకున్నారు.
Read Also: Almonds: టీనేజ్ లోనే ముఖంపై ముడుతలు వస్తున్నాయా..?.. బాదాంను ప్రతిరోజు ఇలా ట్రై చేయండి..
పింప్రి చించ్‌వాడ్‌లోని హింజేవారీ ప్రాంతంలోని ఓయో హోటల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. కాల్పుల ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హోటల్‌కు చేరుకుని మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నేలపై మృతదేహం, గదిలో రక్తపు మరకలు కనిపించాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహిళ వందనా ద్వివేది గాను, ఆమె ప్రియుడు రిషబ్ నిగమ్‌గా గుర్తించారు. ఇద్దరూ కూడా ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు. కొన్నిరోజులుగా ఇద్దరి మధ్య లవ్ ఎఫైర్ ఉండేదని తెలుస్తోంది. అయితే.. ఈ మధ్యనే యువతి, రిషబ్ నిగమ్ ను దూరం పెడుతూ వచ్చింది.
అయితే.. దీన్ని ఇతను భరించలేక మాట్లాడుకుందామని చెప్పి హోటల్ కు తీసుకెళ్లాడు. అప్పటికే ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో తనతో పాటు తెచ్చుకున్న పిస్టల్ తో యువతిని కాల్చి చంపాడు. కాల్పుల శబ్దం రావడంతో సిబ్బంది పరుగున అక్కడికి చేరుకున్నారు. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. హోటల్ సమీపంలోని సీసీ ఫుటేజీ రికార్డును కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook