Minister Nawab Malik Arrest: మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ సీనియర్ నేత నవాబ్ మాలిక్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టోరేట్ అధికారులు బుధవారం (ఫిబ్రవరి 23) అరెస్ట్ చేశారు. అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం, అతని అనుచరులతో మాలిక్ మనీ లాండరింగ్‌‌కి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో బుధవారం మాలిక్‌ను దాదాపు 8 గంటల పాటు ఈడీ విచారించింది. అనంతరం ఆయన్ను అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అరెస్ట్ అనంతరం నవాబ్ మాలిక్‌ను కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయస్థానం మార్చి 3 వరకు ఈడీ కస్టడీకి అప్పగించింది. ఈడీ అరెస్టుపై నవాబ్ మాలిక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ఇంటి నుంచి బలవంతంగా తీసుకొచ్చారని ఆరోపించారు. ఈడీ తనకు మొదట సమన్లు జారీ చేయాల్సిందని.. కానీ అలాంటిదేమీ జరగలేదని అన్నారు. మరోవైపు మహా సర్కార్ నవాబ్ మాలిక్‌కి అండగా నిలిచే ప్రయత్నం చేస్తోంది. ఆయన్ను ప్రభుత్వం నుంచి తప్పించేది లేదని మంత్రి చగన్ భుజ్‌బల్ పేర్కొన్నారు. 


గత 30 ఏళ్లలో నవాబ్ మాలిక్‌పై ఇలాంటి కేసులేవీ తెర పైకి రాలేదని.. ఇప్పుడాయన కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నందువల్ల.. ఆయన నోరు మూయించేందుకే ఈడీతో అరెస్ట్ చేయించారని చగన్ భుజ్‌బల్ ఆరోపించారు. నవాబ్ మాలిక్‌ అరెస్టును నిరసిస్తూ గురువారం (ఫిబ్రవరి 24) శాంతియుత నిరసన ప్రదర్శన చేపట్టనున్నట్లు తెలిపారు. 


నవాబ్ మాలిక్‌పై ఆరోపణలివే :


ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టోరేట్ వెల్లడించిన వివరాల ప్రకారం.. మునీరా ప్లంబర్ అనే దావూద్ గ్యాంగ్ బాధితురాలికి చెందిన రూ.300 కోట్లు విలువైన ఓ ప్రైమ్ ప్లాట్‌ను మంత్రి నవాబ్ మాలిక్ అక్రమంగా స్వాధీనం చేసుకున్నారు. సాలిడస్ ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ద్వారా ఆ ప్లాట్‌ని తన ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఆ కంపెనీ నవాబ్ మాలిక్ కుటుంబానికి చెందినది కాగా.. డీ గ్యాంగ్ (దావూద్ ఇబ్రహీం గ్యాంగ్) సభ్యుల క్రియాశీలక సహకారంతో మాలిక్ దీన్ని నిర్వహిస్తున్నట్లు ఈడీ ఆరోపిస్తోంది.


ఆ ప్లాట్ యజమానురాలైన మునీరా ప్లంబర్ మాట్లాడుతూ.. అసలు తన ప్రాపర్టీని థర్డ్ పార్టీకి అమ్మిన విషయం కూడా తెలియదన్నారు. సలీమ్ పటేల్ అనే దావూద్ గ్యాంగ్ సభ్యుడు ఆ ప్రాపర్టీని విక్రయించాడని.. డాక్యుమెంట్స్‌పై తాను సంతకం చేయకుండానే దాన్ని అమ్మేశారని చెప్పారు. ఈ ప్రాపర్టీ విక్రయంలో కీలక పాత్ర పోషించిన సర్దార్ షావలి అనే వ్యక్తికి 1993 ముంబై పేలుళ్లతో లింకులు ఉన్నట్లు ఈడీ పేర్కొంది. 


Also Read: Horoscope Today Feb 24 2022: రాశి ఫలాలు.. ఆ రాశి వారు తమ సోల్ మేట్‌ని కలిసే ఛాన్స్..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook