తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లో 2 ట్రక్కుల్లో జనాన్ని పట్టుకున్న పోలీసులు
మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దుల్లో (Maharashtra-Telangana border) మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లా పోలీసులు అనుమానంతో ఆ రెండు ట్రక్కులను ఆపి తనిఖీ చేయగా ఈ విషయం బయటపడింది.
యవత్మాల్: తెలంగాణ నుండి మహారాష్ట్ర మీదుగా రెండు భారీ ట్రక్కుల్లో రాజస్థాన్ (Telangana to Rajastan via Maharashtra) బయల్దేరిన కొంతమంది రాజస్తాన్ వాసులను తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లోని యవత్‌మాల్ చెక్ పోస్టులో మహారాష్ట్ర పోలీసులు (Maharashtra police) అడ్డుకున్నారు.
[[{"fid":"183630","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
ప్రజలు రోడ్లపైకి వచ్చి తిరిగితే కరోనావైరస్ మరింత మందికి వ్యాపించే (Coronavirus spread) ప్రమాదం ఉందనే ఆందోళనల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యగా కేంద్రం 21 రోజుల పాటు లాక్ డౌన్ (21 days lockdown) విధించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 14వ తేదీ వరకు ఈ లాక్‌డౌన్ అమలులో ఉండనుంది.
[[{"fid":"183631","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]
తెలంగాణలో లాక్‌డౌన్ ఎంతో పకడ్బందీగా అమలవుతున్న నేపథ్యంలో ఇప్పటివరకు ఇక్కడే ఉండి వివిధ వృత్తులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న వాళ్లలో కొంతమంది ఇదిగో ఇలా రెండు ట్రక్కులను కిరాయికి మాట్లాడుకుని అందులో తమ సొంత రాష్ట్రం రాజస్తాన్ (Rajastan) వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు.
[[{"fid":"183632","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]
అయితే, మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దుల్లో (Maharashtra-Telangana border) మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లా పోలీసులు అనుమానంతో ఆ రెండు ట్రక్కులను ఆపి తనిఖీ చేయగా ఈ విషయం బయటపడింది.