Maharashtra Political Crisis: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. పార్టీలో ఏం జరుగుతుందో పసిగట్టలేకపోయిన ఠాక్రే.. అంతా జరిగాక డ్యామేజ్ కంట్రోల్‌కి ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ రెబల్ ఎమ్మెల్యేలు ఠాక్రే దారికి వచ్చే సూచనలు కనిపించట్లేదు. పైగా రెబల్ ఎమ్మెల్యేల బాటలోనే కొందరు ఎంపీలు సైతం రెబల్ బాట పట్టినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. శివసేనకు చెందిన 19 మంది లోక్‌సభ ఎంపీల్లో 14 మంది రెబల్ క్యాంప్‌కి మద్దతు ప్రకటించినట్లు కథనాలు వస్తున్నాయి. అదే జరిగితే ఉద్ధవ్ ఠాక్రేకి పూడ్చలేని డ్యామేజ్ జరిగినట్లే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏక్‌నాథ్ షిండే నేత్రుత్వంలోని రెబల్ క్యాంప్‌కి మద్దతునిస్తున్న శివసేన ఎంపీల్లో రాజన్ విచారే (థానే లోక్‌సభ), భావన గాలి (వషీం), కృపాల్ తుమానే ( రామ్‌టెక్), శ్రీకాంత్ షిండే (కల్యాణ్), రాజేంద్ర గవిత్ (పాల్ఘర్) తదితరులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో రాజన్ విచారే, శ్రీకాంత్ షిండే అసోం గౌహతిలో రెబల్ క్యాంప్ బస చేస్తున్న ఫైవ్ స్టార్ హోటల్లోనే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎంపీ కృపాల్ తుమానే తాను రెబల్ క్యాంపులో చేరినట్లు వచ్చిన వార్తలను ఖండించినట్లు సమాచారం. తాను ఇప్పటికీ శివసేనతోనే ఉన్నానని ప్రకటించినట్లు తెలుస్తోంది.


ఎమ్మెల్యేలు, ఎంపీలే కాదు కార్పోరేటర్లను సైతం ఏక్‌నాథ్ షిండే తన కంట్రోల్‌లోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు 400 మంది మాజీ కార్పోరేటర్లతో ఏక్‌నాథ్ షిండే రెబల్ క్యాంప్ టచ్‌లో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ పరిణామాలను గమనిస్తే శివసేనను కింది స్థాయి నుంచి పెకిలించేందుకు ఏక్‌నాథ్ షిండే గట్టి వ్యూహమే రచించినట్లు అర్థమవుతోంది. కార్పోరేటర్లు, మాజీ కార్పోరేటర్లు సైతం రెబల్స్‌గా మారనున్నట్లు తెలియడంతో శివసేన అధినాయకత్వం అప్రమత్తమైంది. వెంటనే జిల్లా స్థాయిల్లో అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేస్తోంది. కార్పోరేటర్లు పార్టీ వీడకుండా జాగ్రత్తపడుతోంది.


శివసేనకు 55 మంది ఎమ్మెల్యేలు ఉండగా ప్రస్తుతం ఏక్‌నాథ్ షిండేకి దాదాపు 40 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. నిబంధనల ప్రకారం పార్టీలో మూడింట రెండో వంతు ఎమ్మెల్యేలు వేరే పార్టీలో చేరితే ఫిరాయింపుల చట్టం వర్తించదు. అయితే ఇప్పుడు ఏక్‌నాథ్ షిండే బీజేపీతో కలుస్తారా లేక కొత్త పార్టీ పెడుతారా అనేది సస్పెన్స్‌గా మారింది. 
 



Also Read: Pawan Kalyan: పవన్ కల్యాణ్ తో ప్రకాష్ రాజ్ చర్చలు.. కేసీఆర్ కొత్త పార్టీ గురించేనా?


Also Read: Gold Price Today: తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఇవాళ్టి పసిడి ధరల వివరాలివే..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.