దేశ వాణిజ్య రాజధాని ముంబై బీచ్, సైడ్ సీయింగ్‌లకు ప్రసిద్ధి. దేశ, విదేశీ పర్యాటకులు తరచూ ఈ ప్రదేశాన్ని సందర్శిస్తారు. సాయంత్రం బీచుల్లో సేదతీరుతూ ఆహ్లాదంగా గడుపుతారు. అయితే ఇప్పుడు ముంబై బీచుల్లో ఎక్కడ చూసినా అలర్ట్ బోర్డులు కన్పిస్తున్నాయి. అందుకు ప్రధాన కారణం జెల్లీ ఫిష్‌లు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాల్లోకి వెళితే.. సాధారణంగా వర్షాకాలంలో వచ్చే ఈ జెల్లీ ఫిష్‌లు ఈసారి ఎక్కువ సంఖ్యలో వచ్చాయి. విషపూరిత ‘బాటిల్‌ జెల్లీఫిష్‌లు’ సంచరిస్తుండటంతో ముంబై బీచ్‌లో సంచరించేందుకు ప్రజలు భయపడిపోతున్నారు. అటు జెల్లీ ఫిష్ దాడుల్లో బీచ్‌లో గత రెండు రోజుల్లో 150 మంది గాయపడినట్లు సమాచారం.


బీచ్‌కి వస్తున్న ఎంతో మంది గాయపడ్డారని.. విషం పని చేయకుండా వాళ్ల కాళ్లకు నిమ్మకాయ రాస్తున్నానని.. ప్రజలు బీచ్‌కు రాకపోవటమే మంచిదని అక్కడ ఉండే ఓ షాపు యజమాని అన్నారు. జెల్లీ ఫిష్‌లు మరీ అంత ప్రమాదకరమైనవి కావని అధికారులు చెబుతున్నారు. జెల్లీ ఫిష్‌లో విషముంటుందని.. అయితే వాటి విషంతో చేపలను మాత్రమే చంపుతాయన్నారు. మనుషులను గాయపరిస్తే వచ్చిన ప్రమాదమేమీ లేదన్నారు. కాకపోతే కరిచిన చోట మాత్రం కొన్నిగంటల వరకు నొప్పి, దురద ఉంటుందన్నారు. ఈసారి ఎక్కువ సంఖ్యలో జెల్లీఫిష్‌లు వచ్చాయని.. బీచ్ పరిసరాల్లో వెళ్లకపోవడమే మంచిదని అధికారులు చెబుతున్నారు.