Hanuman Chalisa row: ఎంపీ నవనీత్‌ కౌర్‌ రానా, ఆమె భర్తకు బెయిల్‌ వచ్చింది. హనుమాన్‌ చాలీసా పఠించాలన్న వ్యాఖ్యల గత నెలలో అరెస్టైన రానా దంపతులు.. అప్పటినుంచి కూడా బెయిల్‌ కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎంపీ నవనీత్‌ రానా, ఆమె భర్త రవి రానాకు ఊరట దక్కింది. గత పదిరోజులుగా జైళ్లో ఉన్న ఆ దంపతులకు ముంబై ప్రత్యేక కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ నెల 23న రానా దంపతులను..ఖేర్‌ పోలీసులు అరెస్టు చేసి.. బైకులా జైలుకు తరలించారు. అప్పటి నుంచి కూడా బెయిల్‌ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఇవాళ(మే4వ తేదీన) రానా దంపతులకు కోర్టు బెయిల్‌ ఇచ్చింది.


హనుమాన్‌ చాలీసా వ్యవహారంలో అరెస్టైన అమరావతి ఎంపీ నవనీత్‌ రానా, ఆమె భర్త ఎమ్మెల్యే రవి రానాకు ముంబై స్పెషల్‌ కోర్టు కొన్ని షరతులతో కూడిన బెయిల్‌ ఇచ్చింది. బెయిల్‌పై ఉండగా హనుమాన్‌ చాలీసా అంశంపై ఎలాంటి కామెంట్లు చేయకూడదని ఆదేశించింది. అటు మీడియాతో కూడా మాట్లాడవద్దని కోర్టు హెచ్చరించింది. 


ముంబైలోని మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌ థాక్రె ఇంటి ముందు హనుమాన్‌ చాలీసా పఠించాలన్న వ్యాఖ్యలపై నవనీత్‌ రానా, రవి రానాను ఏప్రిల్‌ 23న అరెస్టు చేశారు. దేశద్రోహం, శత్రుత్వం పెంచేలా వ్యాఖ్యలు చేశారని ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద నవనీత్‌ రానా, ఆమె భర్తపై కేసులు నమోదు చేశారు. ఈ మేరకు ఆ దంపతులు బెయిల్‌ కోరుతూ కోర్టును ఆశ్రయించారు. తమ అరెస్టు అక్రమమని.. కనీసం నోటీసులు ఇవ్వకుండానే అదుపులోకి తీసుకున్నారని పోలీసుల తీరుపై రానా  దంపతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతవారమే కోర్టులో ప్రాసిక్యూషన్‌, డిఫెన్స్‌ తరపున వాదనలు జరిగాయి. ఐపీసీ 153(A) సెక్షన్‌ కింద అభియోగం కొనసాగించలేమని కోర్టు అభిప్రాయపడింది. దేశద్రోహం, శత్రుత్వం పెంచాలన్నది తమ వ్యాఖ్యల వెనక ఉద్దేశం కాదని నవనీత్‌ రానా దంపతులు కోర్టుకు విన్నవించారు. వారి వాదనతో ఏకీభవించిన కోర్టు వారికి షరతులతో కూడిన బెయిల్‌ ను మంజూరు చేసింది. నవనీత్‌ రానా మహారాష్ట్రంలోని అమరావతి లోక్‌ సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్నారు. ఆమె భర్త రవి రానా బద్నెరా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. 



Also read: Mouni Roy Photos: బ్యూటిఫుల్ పిక్స్ తో అలరిస్తున్న 'నాగిని' బ్యూటీ!


Also read: Sweating Reasons: చెమట్లు పడుతుంటే నిర్లక్ష్యం చేయవద్దు..ప్రాణాంతక కేన్సర్‌కు కారణం కావచ్చు కూడా..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook