పుల్వామా తరహాలో దాడి చేసేందుకు ఉగ్రవాదులు మరోసారి కుట్ర చేశారు. ఈసారి కూడా మళ్లీ పుల్వామాలోనే ఈ ఉగ్రదాడికి ప్లాన్ చేయడం విశేషం. కానీ ముందుగానే అప్రమత్తమైన భద్రతా దళాలు.. ఉగ్ర కుట్రను భగ్నం చేశాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పుల్వామా జిల్లాలోని రాజ్ పురా ప్రాంతంలో  ఉగ్రవాదులు మరోసారి భారీ  కుట్రకు  ప్లాన్ చేశారు. అయేన్‌గౌండ్ ప్రాంతంలో కారు బాంబుతో భద్రతా  దళాలపై  దాడి చేసేందుకు ముష్కరులు వ్యూహం రచించారు. ఇందుకు అనుగుణంగా ఓ కారులో బాంబు అమర్చారు. శాంత్రో కారులో ఐఈడీ బాంబు అమర్చి దాడికి పాల్పడే కుట్ర  జరుగుతోందని సీఆర్పీఎఫ్ కు సమాచారం అందింది. దీంతో నాలుగు, ఐదు రోజుల నుంచి పుల్వామా జిల్లాలోని పలు ప్రాంతాలను పోలీసులు జల్లెడ పడుతున్నారు. 


[[{"fid":"186133","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


ఇవాళ ఉదయం అయేన్‌గౌండ్ ప్రాంతంలో  సీఆర్పీఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, భారత ఆర్మీ దళాలు సంయుక్తంగా తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ  కారులో ఐఈడీ బాంబు లభ్యమైంది. బాంబు స్క్వాడ్ తో దాన్ని నిర్వీర్యం చేశారు. కారుకు సమీపంలోనే ఉన్న ఉగ్రవాదిని పోలీసులు పట్టుకునేందుకు ప్రయత్నించారు.  కానీ తప్పించుకుని పారిపోయాడని కాశ్మీర్ రేంజ్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. 


పుల్వామా జిల్లాలో వారం రోజుల వ్యవధిలో ఇది రెండో ఘటన కావడం విశేషం. వారం క్రితం జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్  జవాన్లు పట్రోలింగ్ చేస్తుండగా ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. ఆ తర్వాత ఇప్పుడు ఐఈడీ బాంబుతో కారు పట్టుబడడం విశేషం. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..