కార్పొరేట్ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం !
మెట్రో ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం
న్యూఢిల్లీ: ఢిల్లీ శివార్లలోని నొయిడా 11వ సెక్టార్‌లో వున్న మెట్రో ప్రైవేటు ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అగ్ని ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు 12 ఫైర్ ఇంజన్లతో ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పుతున్నారు. మరోవైపు మంటల కారణంగా ఆస్పత్రి భవనంలోనే చిక్కుకున్న రోగులను, సిబ్బందిని భవనం అద్దాలు పగలగొట్టి సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు.
అగ్ని ప్రమాదానికి గల కారణం ఏంటనేది ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. ఘటనకు సంబంధించి మరింత సమాచారం అందాల్సి వుంది.