Kangana ranaut hot comments on pak and congress party: ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కంగాన రనౌత్ కులు ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో కంగానా పాకిస్తాన్ పై, ఇండియా కూటమిపై మండిపడ్డారు. ఇటీవల నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా మాట్లాడుతూ.. పాకీస్థాన్ గాజులు వేసుకుని కూర్చోలేదని,తమ జోలికివస్తే అణుబాంబులతో సమాధానమిస్తామని వ్యాఖ్యలు చేశారు. ఇక కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యార్ కూడా.. పాక్ వద్ద అణుబాంబులున్నాయని ఆచీతూచీ నిర్ణయాలు తీసుకొవాలంటూ వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా.. హిమచల్ ప్రదేశ్ లోని మండి నుంచి ఎన్నికల బరిలో ఉన్న కంగానా రనౌత్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. పాక్ లో ఇప్పటి వరకు, నిత్యావసరాలు, గోధుమలు, డీజీల్, ఆహార పదార్థాల కోరత ఉందని మాత్రమే అనుకుంటున్నామని, కానీ ఇటీవల పాక్ లో గాజుల కొరత కూడా ఉందని సెటైర్ లు వేశారు. అంతే కాకుండా కాంగ్రెస్ నేతలు.. పాక్ దగ్గర అణుబాంబులున్నాయని, భయపడుతున్నారని, ఇలాంటి వారు దేశానికి ఎలాంటి మంచిచేస్తారంటూ ఎద్దేవా చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read more:Viral Video: ఓవరాక్షన్ చేస్తే ఇట్లనే ఉంటది మరీ.. బొక్కొ బొర్లా పడిన యువకుడు.. వీడియో వైరల్..


తొందరలోనే పాక్ కు గాజులు వేసుకునేలా చేస్తామని ఫైర్ అయ్యారు. ఇదిలా ఉండగా.. ప్రధాని మోదీ కూడా ఇటీవల పాక్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇక పాక్ ఫరూక్ అబ్దుల్లా చేసిన కామెంట్లపై ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా సెటైర్ లు వేశారు. పాక్.. అణుబాంబులు వేస్తామని భయపెడుతుంది... తమ వద్ద ఉన్న అణు బాంబులు ఫ్రిడ్జీలో పెట్టుకొవడానికి అనుకుంటున్నారా..?.. అంటూ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ కు ఎన్నికలలో ఓటు వేస్తే, అది పాక్ కు పోతుందని ఇటీవల, అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ వ్యాఖ్యలు చేశారు.


ప్రస్తుతం దేశంలో ఎన్నికల హీట్ నడుస్తోంది. ఇప్పటికే నాలుగు విడతల్లో ఎన్నికలు ముగిశాయి. మరోవైపు కాంగ్రెస్, బీజేపీలు ఆరోపణలు , ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ నేతలు పాక్ ను చూసి భయపడుతున్నారని, ఈ నేపథ్యంలో.. గట్టిగా నిర్ణయాలు తీసుకునే వారు దేశానికి అవసరమంటూ కంగాన అన్నారు.  ప్రజలు దేశంలో.. బీజేపీకి భారీ మెజార్టీ ఇవ్వాలంటూ కూడా మోదీ, కంగనా రనౌత్ ఎన్నికల ప్రచారంలో కోరుతున్నారు. 
దేశంలో ఎన్నికల ఒక రేంజ్ లో హీట్ ను పుట్టిస్తున్నాయి. నాయకులు, ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు.


Read more : Dice Snakes: ఆస్కార్ లెవల్ పర్ఫామెన్స్.. చచ్చిపోయినట్లు నటిస్తున్న పాములు.. కారణం ఏంటో తెలుసా..?


ఇక నువ్వా నేనా.. అన్న విధంగా ఎన్నికలలో ప్రచారం నిర్వహిస్తున్నారు . ఇటీవల ప్రధాని మోదీమూడోసారి వారణాసి నుంచి నామినేషన్ దాఖలు చేశారు.ఈ కార్యక్రమానికి బీజేపీ ముఖ్య నేతలు, దాదాపు 12 రాష్ట్రాల సీఎంలు హజరయిన విషయం తెలిసిందే. మరోసారి మోదీని భారీ మెజార్టీతో గెలిపించి, హ్యట్రీక్ పీఎంగా ఎన్నుకొవాలని కూడా పిలుపునిచ్చారు.
 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter