West Bengal Cabinet: పశ్చిమ బెంగాల్‌లో జంబో కేబినెట్, కాస్సేపట్లో ప్రమాణ స్వీకారం
West Bengal Cabinet:పశ్చిమ బెంగాల్‌లో జంబో కేబినెట్ కొలువు దీరబోతోంది. వరుసగా మూడవ సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన దీదీ..భారీ కేబినెట్ ఏర్పాటు చేశారు. కాస్సేపట్లో మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయనుంది.
West Bengal Cabinet:పశ్చిమ బెంగాల్‌లో జంబో కేబినెట్ కొలువు దీరబోతోంది. వరుసగా మూడవ సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన దీదీ..భారీ కేబినెట్ ఏర్పాటు చేశారు. కాస్సేపట్లో మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయనుంది.
దేశంలో ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్(West Bengal)లో మమతా బెనర్జీ మరోసారి విజయం సాధించారు. టీఎంసీ మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దేశమంతా ఆసక్తి రేపిన ఈ ఎన్నికల్లో విజయం సాధించి..బెంగాల్ కోటపై కాషాయ జెండా ఎగురవేయాలని బీజేపీ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి..బీజేపీ ( BJP) 75 సీట్లకే పరిమితమైంది. మమతా బెనర్జీ ప్రభుత్వం మరోసారి ఘన విజయం సాధించింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా మూడవసారి ఇప్పటికే ప్రమాణ స్వీకారం చేసిన మమతా బెనర్జీ (Mamata Banerjee) కేబినెట్ విస్తరించారు. ఏకంగా 43 మందితో జంబో కేబినెట్ ఏర్పాటు చేశారు. మరికాస్సేపట్లో పశ్చిమ బెంగాల్ మంత్రివర్గం (Mamata Banerjee Cabinet) ప్రమాణ స్వీకారం చేయనుంది. గవర్నర్ జగ్‌దీప్ ధన్‌కర్ మంత్రులతో ప్రమాణం చేయించనున్నారు. కరోనా సంక్రమణను దృష్టిలో పెట్టుకుని పరిమిత సంఖ్యలోనే అతిధుల్ని ఆహ్వానించారు. క్రికెటర్ మనోజ్ తివారీకు మంత్రివర్గంలో స్థానం కల్పించారు మమతా బెనర్జీ.
Also read: COVID-19 Lockdown: నేటి నుంచి లాక్‌డౌన్ అమలవుతున్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook