Man dies after co-workers pump air into him for 'fun': సహోద్యోగుల సరదా వల్ల ఒక నిండు ప్రాణం పోయింది. ఒక వ్యక్తి శరీరంలోకి బలవంతంగా గాలిని పంపగా లివర్‌ డ్యామేజ్‌ అయి అతను మరణించాడు. పశ్చిమ బెంగాల్‌లోని (West Bengal) హుగ్లీ జిల్లాలో (Hoogly district) ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ నెల 16న నైట్‌ డ్యూడీ సందర్భంగా నార్త్ బ్రూక్ జూట్ మిల్‌లో (North Brook Jute Mill) పని చేసే రెహమత్ అలీని (Rehmat Ali) సహోద్యోగులు సరదాగా ఆటపట్టించారు. కానీ అదే అతని ప్రాణాలు తీసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మిల్లులో జనపనారను క్లీన్‌ చేసే ఎయిర్‌ పంప్‌తో గాలిని.. అలీ దిగవ భాగం నుంచి అతని శరీరంలోకి పంపారు. అలీ ఎంత ప్రతిఫటించినా కూడా అతని సహోద్యోగులు పట్టించుకోలేదు. బలవంతంగా అతని శరీరంలోకి గాలిని పంప్‌ చేశారు.


దీంతో అలీ తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. కుటుంబ సభ్యులు మొదట అతన్ని హుగ్లీలోని చుంచురా ఇమాంబర హాస్పిటల్‌లో చేర్పించారు. అయితే అతని ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో మరో ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటన జరిగిన తర్వాత పది రోజుల పాటు అలీ (Ali) చికిత్స పొందుతూ.. చివరకు మరణించాడు. అతడి శరీరంలోకి పంపిన గాలి ఒత్తిడి కారణంగా కాలేయం (liver) పూర్తిగా దెబ్బతినడంతోనే రెహమత్ అలీ చనిపోయినట్లు డాకర్లు తెలిపారు.


Also Read : RRR Janani Song: విడుదలైన RRR జనని సాంగ్..రోమాలు నిక్కబొడుచుకునేలా ఉన్న భావోద్వేగాలు


అలీ కుటుంబ సభ్యులు భద్రేశ్వర్ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేశారు. మిల్లులో ఎయిర్‌ పంప్‌తో జూట్‌ను శుభ్రం చేసే సహోద్యోగి షాజాదా ఖాన్ వల్లే రెహమత్ అలీ మరణించాడని తెలిపారు.షాజాదా ఖాన్ (Shahzada Khan) బలవంతంగా రెహమత్ అలీ (Rehmat Ali) శరీరం దిగువ భాగం నుంచి ఎయిర్‌ పంప్‌ ద్వారా గాలిని పంపాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఈ ఘటనపై సదరు జూట్‌ మిల్లు యాజమాన్యం మాత్రం స్పందించలేదు.


Also Read : CM Jagan: చంద్రబాబు సంస్కారానికి నా నమస్కారాలు-అసెంబ్లీ వేదికగా జగన్ కౌంటర్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook