Man kills wife : టవల్ ఆలస్యంగా ఇచ్చిందని భార్యనే చంపిన భర్త
Man kills wife for delay in giving bath towel : కొన్ని నిమిషాల తర్వాత టవల్ ఇచ్చింది భార్య పుష్పా బాయ్. అప్పటికే విపరీతమైన కోపంతో ఉన్న రాజ్‌కుమార్ అక్కడే ఉన్న పారతో భార్య తలపై దాడి చేశాడు. దీంతో పుష్పా బాయ్ అక్కడికక్కడే మృతి చెందింది.
Man kills wife with shovel over delay in giving towel after bath: అడిగిన వెంటనే టవల్ ఇవ్వలేదనే కోపంతో భార్యను చంపేశాడు ఓ క్రూరుడు. మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) బాలాఘాట్ జిల్లా హీరాపుర్ గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
నిందితుడు అటవీ శాఖలో తాత్కాలిక ఉద్యోగిగా పనిచేస్తున్న రాజ్‌కుమార్ (Rajkumar) బాహేగా పోలీసులు గుర్తించారు. ఇంట్లో స్నానం ముగించుకున్న రాజ్‌కుమార్.. భార్య పుష్పా బాయ్ (45)ని (Pushpa Bai) టవల్ అడిగాడు. అయితే పుష్పా బాయ్ తాను పనిలో ఉన్నానని.. కొద్దిసేపు ఉండు ఇస్తానని భర్తకు సమాధానం ఇచ్చింది. ఆ సమయంలో ఆమె వంట పాత్రలు శుభ్రం చేస్తోంది.
Also Read : Fake currency in Hyderabad : హైదరాబాద్ లో రూ.2 కోట్ల నకిలీ నోట్లు స్వాధీనం
చెప్పినట్లుగానే కొన్ని నిమిషాల తర్వాత టవల్ (towel) ఇచ్చింది భార్య పుష్పా బాయ్. అప్పటికే విపరీతమైన కోపంతో ఉన్న రాజ్‌కుమార్ అక్కడే ఉన్న పారతో భార్య తలపై దాడి చేశాడు. దీంతో పుష్పా బాయ్ అక్కడికక్కడే మృతి చెందింది. తండ్రి ఘాతుకాన్ని 23ఏళ్ల కూతురు (23-year-old daughter) అడ్డుకోవడానికి ప్రయత్నించింది. అడ్డొస్తే చంపేస్తానని తండ్రి బెదిరించడంతో ఆమె మౌనంగా ఉండిపోయింది. పోలీసులు (police) కేసు (case) నమోదు చేసి నిందితుడిని (accused) అరెస్టు చేశారు.
Also Read : PV Sindhu: బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు డ్యాన్స్...వీడియో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook