Man shoots barber dead for refusing him haircut: ఉత్తర్​ప్రదేశ్(Uttar Pradesh)​ బులంద్​షహర్​ జిల్లా అగౌతా(Agauta)లో దారుణం జరిగింది. కటింగ్( haircut) చేసేందుకు నిరాకరించాడని బార్బర్​(bulandshahr barber)ను కాల్చి చంపాడు ఓ వ్యక్తి. అతని సోదరుడి కాలిలో కూడా బుల్లెట్ దింపాడు. షారిపుర్​ భైన్​స్రోలి (Sharifpur Bhainsroli)లో బుధవారం జరిగిన ఈ ఘటనకు సబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. వారి కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read: Man killed by minor daughter : లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డ్డ తండ్రిని హత్య చేసిన కూతురు


మృతుడి పేరు ఇర్ఫాన్, నిందితుడి పేరు సమీర్ అని పోలీసులు తెలిపారు. కటింగ్ చేయించుకునేందుకు వెళ్లిన సమీర్​ను పాత బాకీ చెల్లించాలని ఇర్ఫాన్ అడిగాడు. లేకపోతే కటింగ్ చేయనన్నాడు. దీంతో కోపోద్రిక్తుడైన సమీర్ అతడిని తపాకీతో కాల్చి చంపాడు. ఇర్ఫాన్ సోదరుడ్ని కూడా గాయపరిచాడు. ఇర్ఫాన్ అక్కడికక్కడే మృతి చెందగా.. సోదరుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook