న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న ఢిల్లీలోని తబ్లీగి జమాతే కరోనా కేసుల అంశం రాష్ట్రాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇప్పటికే చాలా మందిని ఐసొలేషన్ కు తరలించినప్పటికీ దేశ రాజధానిలోని వివిధ మసీదులలో ఎక్కువ మంది విదేశీయులు ఉంటున్నారని దర్యాప్తులో తేలిందని కేంద్రం ప్రకటించింది. ఢిల్లీలోని మసీదుల్లో ఉన్న మిగిలిన వారిని గుర్తించడానికి కేంద్రం, ఢిల్లీ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read Also: కరోనావైరస్‌ను ఓడించిన 93 ఏళ్ల వృద్ధ దంపతులు


నిజాముద్దీన్ పరిసర ప్రాంతాల్లో జరిగిన మత సమ్మేళనంలో పాల్గొన్న వివిధ దేశాలకు చెందిన మత ప్రచారకులు నగరంలోని మసీదుల్లో నివసిస్తున్నారన్న సమాచారం తమకుందని, చాలా మంది విదేశీయులను కనిపెట్టడానికి 30 మందితో స్పెషల్ టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేశామని కేంద్రం ప్రకటించింది. గత నాలుగు రోజుల నుండి పోలీసులు, ఆరోగ్య శాఖకు సంబంధించిన అధికారులు పెద్ద ఎత్తున బృందాలుగా ఏర్పడ్డాయని, మసీదులను జల్లెడ పడుతున్నాయని, జమాతే మాట ప్రార్థనల్లో సుమారుగా 800 మంది విదేశీయులు పాల్గొన్నట్లుగా గుర్తించామని తెలిపారు. 


Read also : 24 గంటల్లో 478 కేసులు.. 2500 దాటిన కోవిడ్ కేసులు


కరోనా వ్యాప్తి సంక్రమణ మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్న వారి ద్వారానే అత్యధికంగా వ్యాపించి ఉండవచ్చని, ఇదే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న అంశమని ఓ అధికారి పేర్కొన్నారు. జమాతే ప్రార్ధనల్లో పాల్గొన్న వారిని ఇప్పటికే చాలామందిని క్వారంటైన్ కు తరలించిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని చాలా మసీదుల్లో తలదాచుకున్న వారిని రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో బయటికి రప్పిస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. కాగా ఢిల్లీలోని కరోనా సంక్రమణకు తబ్లీగి జమాతే కారణమని, మొత్తం 386 కరోనా పాజిటివ్ కేసుల్లో సుమారుగా 260కి పైగా కేసులు మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్నవారివేనని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..