Hidma Died: చత్తీస్గడ్-తెలంగాణ బోర్డర్లో భీకర ఎన్ కౌంటర్..మావోయిస్టు కీలక నేత హిడ్మా మృతి!
Maoist Central Committee Member Hidma Died: ఛత్తీస్‌గఢ్-తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పులలో మావోయిస్టుల కీలక నేత హిడ్మా మృతి చెందాడు. ఆ వివరాలు
Maoist Central Committee Member Hidma Died: ఛత్తీస్‌గఢ్-తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పులలో మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ తగలింది. కేంద్ర కమిటీ సభ్యుడు, అనేక కేసుల్లో మోస్ట్ వాంటెడ్ గా ఉన్న హిడ్మా హతమయ్యాడు. తెలంగాణ- బీజాపూర్ సరిహద్దుల్లో గ్రేహౌండ్స్, సీఆర్‌ఫీఎఫ్ కోబ్రా ఆధ్వర్యంలో నిర్వహించిన ఒక జాయింట్ ఆపరేషన్‌లో హిడ్మా మృతి చెందాడు.
ఛత్తీస్‌ఘడ్, తెలంగాణ, ఒడిశా సహా పలు రాష్ట్రాల్లో మావోయిస్టు కీలక వ్యూహకర్తగా హిడ్మా వ్యవహరించి అనేక దాడుల్లో కీలకంగా వ్యవహరించారు. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా-బీజాపూర్, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో ఎన్‌కౌంటర్ ఇంకా కొనసాగుతున్నట్లు చెబుతున్నారు. ఈ ఎన్‌కౌంటర్‌లో పలువురు నక్సలైట్లు హతమైనట్లు సమాచారం అందుతున్నాయా ఈ విషయంపై ఇప్పటివరకు అధికారిక ధృవీకరణ లేదు. 1996-97 లలో 17 ఏళ్ల వయసులో హిడ్మా ఉద్యమం పట్ల ఆకర్షితుడై మావోయిస్టుల్లో చేరాడని అంటున్నారు. చత్తీస్‌గడ్‌లోని దక్షిణ బస్తర్ జిల్లా సుక్మా జిల్లాలోని పువర్తి హిడ్మా స్వగ్రామం కాగా అతనికి సంతోష్, హిద్మల్లు వంటి మారు పేర్లు కూడా ఉన్నాయని అంటున్నారు.
ఉద్యమంలోకి రాక ముందు హిడ్మా వ్యవసాయం చేసేవాడని, 7వ తరగతి వరకే చదువుకున్న హిడ్మా.. మావోయిస్టు పార్టీతో పని చేసిన ఓ లెక్చరర్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ప్రావీణ్యం సంపాదించాడని అంటూ ఉంటారు. ఇక ఆయుధాల తయారీ, రిపేర్ వర్క్‌లో నిపుణుడిగా మారిన హిడ్మా 2001-02 ప్రాంతాల్లో దక్షిణ బస్తర్ జిల్లా ప్లటూన్‌లో మంచి పట్టు సంపాదించాడు.
ఇక హిడ్మా మీద 45 లక్షల రివార్డు ఉందని అంటున్నారు. 2010లో తడ్ మెట్ల వద్ద మెరుపు దాడి చేసి 24 మంది జవాన్లను చంపిన కేసు, 2013లో కాంగ్రెస్ నేతలను ఊచకోత ఘటన, 2017 సుక్మా జిల్లాలో 27 మంది సీఆర్‌పీఎఫ్ జవా న్లపై దాడి హతమార్చిన ఘటనలకు అతనే ప్రధాన వ్యూహకర్త అని తెలుస్తోంది. ఇటీవల కూడా అంటే 2021 ఏప్రిల్ 4న బీజాపూర్ జిల్లా తరెంలో హిడ్మా వ్యూహంలో చిక్కు కుని 22 మంది బీఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. అలాంటి హిడ్మాను తెలంగాణ గ్రే హౌండ్స్ మట్టుపెట్టడం మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ అని అంటున్నారు.
Also Read: Prabhas Craze: ఏమాత్రం తగ్గని ప్రభాస్ క్రేజ్.. ఏడాది మొత్తం అదే హవా!
Also Read: Chiranjeevi Vs Balakrishna: 9 సార్లు సంక్రాంతికి బాలయ్య-చిరు పోటీ.. ఎవరెన్ని హిట్లు కొట్టారంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook