Professor Saibaba:మావోయిస్టులతో లింక్ లు.. ప్రొఫెసర్ సాయిబాబాను నిర్దోషిగా ప్రకటించిన హైకోర్టు..
Maoist Links Case: ప్రొఫెసర్ సాయిబాబాకు బాంబె కోర్టు భారీ ఊరట కల్గించింది. ఆయన మావోయిస్టులతో సంబంధాలు కొనసాగిస్తున్నారని ఎన్ఐఏ పోలీసులు ఆయనపై అభియోగాలు మోపి కేసులు నమోదు చేశారు. 2017లో, గడ్చిరోలిలోని సెషన్స్ కోర్టు ప్రొఫెసర్ సాయిబాబా తో పాటు మరికొందరు మావోయిస్టులతో కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు అధికారులకు ఫిర్యాదులు అందాయి.
Bombay Highcourt Acquits GN Saibaba Maoist Links Case: కొన్నేళ్లుగా జైలులో శిక్షను అనుభవిస్తున్న ప్రొఫెసర్ సాయిబాబాకు బాంబె హైకోర్టు మంగళవారం భారీ ఊరట కల్పించింది. ఇప్పటికే ఆయన వీల్ చైర్ కే పరిమితం అయ్యారు. ఒక మనిషి సహాయం లేనిదే.. తన పనులు కూడా తాను చేసుకొలేరని ఆయ కుటుంబం అనేక మార్లు కోర్టులో పిటిషన్ లు దాఖలు చేసింది. అదే విధంగా గతంలో.. ఎన్ఐఏ ఆయనపై పలు కేసులను నమోదు చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా.. గడ్చిరోలి ఘటనలో ప్రొఫెసర్ కీ రోల్ ప్లే చేశారని, ఎన్ఐఏ అభియోగాలు మోపింది.
Read More: Grapes Fruit Benefits: ద్రాక్ష పండు రుచికరం మాత్రమే కాదు ఆరోగ్యకరమైనది కూడా..!
విద్యార్థులను కావాలనే రెచ్చగొట్టి మావోయిస్టుల వైపు వెళ్లేలా ప్రొఫెసర్ సాయిబాబా చేశారంటూ ఆరోపింది. ఈ క్రమంలో ఆయనను.. గడ్చిరోలిలోని సెషన్స్ కోర్టు దోషులుగా నిర్దారించింది. ఆతర్వాత ఈ కేసులు బాంబె హైకోర్టుకు వెళ్లింది. ఈ క్రమంలోనే .. బాంబె హైకోర్టు.. అక్టోబరు 14, 2022న వైకల్యం ఉన్న ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబాను నిర్దోషిగా ప్రకటించింది. కానీ దీనిపై ఎన్ఐఏ అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఈ క్రమంలో ఆయన విడుదలపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. దీనిపై స్టే విధించింది. అంతేకాకుండా.. ఈ కేసు విచారణను పరిశీలించాల్సిందిగా బాంబె హైకోర్టుకు రిఫర్ చేసింది. ఇతర విద్యార్థులను మావోయిస్టులవైపు వెళ్లేలా ప్రొత్సహించడం, దేశంపై యుద్ధం చేసే కార్యకలాపాలకు ఇన్ డైరెక్ట్ గా పాల్పడినందుకు వీరిని కోర్టు దోషులుగా నిర్ధారించింది. ప్రస్తుతం నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో ఉన్నారు.
Read More: Ketika Sharma: పూల తోటలో కేక పుట్టిస్తోన్న కేతిక శర్మ గ్లామర్ డోస్.. ఇది మాములు డోస్ కాదండోయ్..
ఈ క్రమంలోనే.. తాజాగా, బాంబె కోర్టు.. సాయిబాబాను బాంబే హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. దీంతో ఆయన కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ప్రొఫెసర్ సాయిబాబా ఇంట్లో నక్సల్ సాహిత్యం, మావొయిస్టులతో సంబంధాలున్నట్లు పలు ఆధారాలను ఎన్ఐఏ కోర్టులో ఇప్పటికే సబ్మిట్ చేసింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook