Encounter: వరుస షాకులతో కుదేలవుతున్న మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. పోలీసుల కాల్పుల్లో అగ్రనేత చనిపోయారు. ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని దంతేవాడ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు అగ్ర నేత మార్కమ్ చనిపోయాడు. కాటేకల్యాణ్ అటవి ప్రాంతంలో ఈ కాల్పుల ఘటన జరిగింది. ఎన్ కౌంటర్ లో మరికొందరు మావోయిస్టులకు గాయలయ్యాయని తెలుస్తోంది. మిగితా మావోయిస్టుల కోసం భద్రత బలగాలు గాలిస్తున్నాయి. మార్కమ్ దంతేవాడ జిల్లాలో మానోయిస్టు కార్యకలాపాలకు నేతృత్వం వహిస్తున్నాడు. పోలీసులకు సవాల్ విసురుతున్నాడు, కొన్ని రోజులుగా మార్కమ్ టార్గెట్ గా బలగాలు స్పెషల్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అడవిలో భద్రతా బలగాలకు మావోయిస్టు దళాలు తారసపడ్డాయని తెలుస్తోంది. ఇరు వర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత మార్కమ్ చనిపోయాడని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.