Massive Fire Explossion In Patna: బీహర్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. గురువారం రోజుల పట్నాకు నడిబొడ్డున ఒక రెస్టారెంట్ లో మంటలు వ్యాపించాయి. దీంతో అక్కడున్న 8 నుంచి 10 సిలిండర్ లు పేలినట్లు తెలుస్తోంది. దీంతో ఫైర్ సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అదేవిధంగా.. ఈ ఘటనలో ఇప్పటికే ఆరుగురు సజీవ దహానమైనట్లు తెలుస్తోంది. మరో 12ని ఆస్పత్రికి తరలించారు. ఇంకా ఇరవై మంది వరకు కూడా తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ఆకాశంల ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. దట్టమైన పొగలు అలుమున్నాయి. ఈ ఘటన ప్రస్తుతం తీవ్ర విషాదకరంగా మారింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేయడానికి 8 నుంచి 10 వరకు ఫైర్ సర్వీసులను ఉపయోగిస్తున్నట్లు సమాచారం. ఘటన జరగగానే పెద్ద ఎత్తున ఫైర్ సెప్టీ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు. అంతేకాకుండా స్థానికులు కూడా పెద్ద ఎత్తు సహాయ చర్యలు చేపట్టారు. దీనిపై పోలీసులు కేసు నమోదుచేసుకుని విచారణ చేపట్టారు.


Read More: Angry Girl Acid attack On Boyfriend: పెళ్లిలో ఊహించని ఘటన.. వరుడిపై యాసిడ్ దాడి.. షాకింగ్ వీడియో వైరల్..


ఘటన జరగటానికి గల కారణం, షార్ట్ సర్క్యూట్ మరేంటా అన్న కోణంతో పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది.ఈ  ఘటన మాత్రం ప్రస్తుతం ఆస్పత్రిలో కొందరు ఐసీయూలో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి కూడా సీరియస్ గాఉన్నట్లు తెలుస్తోంది. మంటలు మాత్రం కొద్ది కొద్దిగా  అదుపులోకి వచ్చినట్లు తెలుస్తోంది. పాట్నాలో జరిగిన ఘటనలో ఇప్పటి దాక 30 మంది వరకు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. అసలే ఒక వైపు ఎండలు దంచికొడుతున్నాయి.మరోక వైపు దట్టమైన పొగలు ఆకాశంలో ఎగిసి పడుతుండటంతో, ఆ ప్రాంతంలో దట్టమైన నల్లని మేఘాలు అలుముకున్నాయి.


ఇదిలా ఉండగా.. మంటలను అదుపు చేయడానికి ఫైర్ సిబ్బంది కూడా కష్టపడాల్సి వచ్చింది. స్థానికులు కూడా మంటలదగ్గరకు వెళ్లడానికి కాస్తంత ఇబ్బందులుపనినట్లు సమాచారం. ఒకవైపు మంటలు, మరోవైపు  ఎండవేడితో కలిసి ఆ ప్రమాదం జరిగిన చుట్టుపక్కల ప్రజలు ఉక్కిరిబిక్కిరైపోయారు.  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter