Jammu Kashmir Bus Accident: జమ్మూ కాశ్మీర్లో లోయలో పడిన బస్సు.. 8 మంది మృతి.. ప్రమాదం జరగడానికి కారణాలు ఇవే!
Jammu Kashmir Bus Accident: జమ్మూ కాశ్మీర్ లోని అదుపుతప్పి బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 8 మంది మరణించగా 20 మందికి పైగా గాయాల పాలయ్యారు. ఈ దుర్ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Jammu Kashmir Bus Accident: జమ్మూ కాశ్మీర్లో ఘోర ప్రమాదం జరిగింది. అమృత్సర్ నుంచి కాత్ర తిరిగి వెళ్తున్న బస్సు జమ్ము ప్రాంతంలోని జాజర్ కొట్లిలో లోతైన లోయలో అదుపుతప్పి పడింది. ఈ సంఘటనలో అక్కడికక్కడే ఏడుగురు మరణించగా మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారందరినీ స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. స్థానికులు అందించిన సమాచారం మేరకు పోలీసులు ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నారు.
వంతెన పైనుంచి బస్సు వెళుతుండగా.. అదుపుతప్పి వంతెన నుంచి పక్కనే ఉన్న లోయలో ఒక్కసారిగా పడిపోవడంతో ఈ దుర్ఘటన జరిగిందని పోలీసులు వెల్లడించారు. బస్సు నుజ్జునుజ్జు కావడంతో 8 మంది మరణించారని.. మరణాల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయని జమ్మూ కాశ్మీర్ పోలీసులు తెలిపారు.
నెత్తుటి మయమవుతున్న రహదారులు:
దేశంలో రోడ్డు ప్రమాదాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. నిన్న కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన పదిమంది మరణించగా.. ఈరోజు జరిగిన బస్సు ప్రమాదంలో ఏడుగురు మరణించడం అందర్నీ ఆందోళనకు గురి చేస్తుంది. సోమవారం మైసూర్ లో జరిగిన రోడ్డు దుర్ఘటనలో ఓ ట్రావెల్స్ బస్సు ఎదురుగా వస్తున్న కారును బలంగా ఢీకొంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న పదిమంది మరణించగా మరో ముగ్గురు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. ఇలా రోజురోజుకు ప్రమాదాలు పెరగడానికి ప్రధాన కారణాలు అతివేగమేనని నిపుణులు చెబుతున్నారు.
ఇటీవలే కుర్బూర్ ప్రాంతంలోని 766వ నేషనల్ హైవే పై కూడా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ జాతీయ రహదారి పై ఉన్న మలుపు వద్ద ఓ ప్రైవేటు బస్సు ఎదురుగా వస్తున్న కారును ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించారు. ఈ ప్రమాదంలో బయటపడ్డ ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స పొందుతూ మరణించారు. ఇలా ప్రతిరోజు ఎన్ని రోడ్డు భద్రత నియమాలు పాటించిన ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికైనా ఈ ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు పలు చర్యలు తీసుకోవాలని రోడ్డు ప్రమాద బాధితులు సూచిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి