MDH Masala Mahashay Dharampal Passes away: న్యూఢిల్లీ: ప్రముఖ మసాలా కంపెనీ ఎండీహెచ్‌ (Mahashian Di Hatti ) యజమాని మహాశయ్ ధరంపాల్‌ గులాటి (98) గురువారం తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొన్ని వారాలుగా ఆయన ఢిల్లీలోని మాతాచానన్‌ దేవి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో మహాశయ్ ధరంపాల్ గులాటి గురువారం తెల్లవారుజామున 5.30గంటలకు ఆసుపత్రిలో తుదిశ్వాస (Dharampal Passes away) విడిచారు. ధరంపాల్‌ గులాటీని ‘దాదాజీ’ ‘మహాషైజీ’ని అని పిలుస్తారు. ఎండీహెచ్ (MDH) అధినేత మహాశయ్ ధరంపాల్ గులాటి (Mahashay Dharampal Gulati) 1923లో పాకిస్థాన్‌లోని సియోల్‌కోట్‌లో జన్మించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ధరంపాల్‌ గులాటి తండ్రి చుని లాల్ అప్పట్లో సియోల్‌కోట్‌లో మహాషియన్ డి హట్టి (Mahashian Di Hatti) పేరుతో మసాలాల వ్యాపారం ప్రారంభించారు. తండ్రికి సాయం చేసేందుకు గులాటి చిన్నతనంలోనే చదువు మానేశారు. దేశ విభజన అనంతరం ధరంపాల్ గులాటి భారత్‌కు వచ్చి ఢిల్లీలోని కరోల్‌బాగ్‌ ప్రాంతంలో ఓ చిన్న షాప్‌ను ప్రారంభించారు. అక్కడి నుంచి మహాశయ్ ధరంపాల్‌ గులాటి.. తన ఎండీహెచ్ కంపెనినీ దేశం, ప్రపంచంలోనే ప్రముఖ మసాలా కంపెనీగా తీర్చిదిద్దారు. భారత్ నుంచి అనేక దేశాలకు ఎండీహెచ్ మసాలాలు ఎగుమతి అవుతుంటాయి. ఈ మేరకు భారత ప్రభుత్వం 2019లో అత్యున్నత పురస్కారం పద్మ భూషణ్ ( Padma Bhushan ) ‌తో మహాశయ్ ధరంపాల్ గులాటీని సత్కరించింది. Also read: TS ICET-2020: టీఎస్ ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల


మహాశయ్ ధరంపాల్ గులాటీ మరణం పట్ల ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్ ( Arvind Kejriwal )‌, డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయనతో దిగిన ఫొటోలను కేజ్రీవాల్, సిసోడియా ట్వీట్‌ చేశారు. ధరంపాల్ గులాటి తన జీవితాన్ని సమాజం కోసం అంకితం చేసిన వ్యక్తి అని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ కేజ్రీవాల్‌ ట్విట్ చేశారు. Also read: Yada Krishna: టాలీవుడ్ నటుడు కన్నుమూత


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe