Major Dhyan Chand Sports University: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో (Meerut district) మేజర్ ధ్యాన్ చంద్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి (Major Dhyan Chand Sports University) ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఆదివారం శంకుస్థాపన చేశారు. సర్ధానా పట్టణం శివార్లలోని సలావా, కైలీ గ్రామాల నడుమ ఈ విశ్వవిద్యాలయాన్ని స్థాపించనున్నారు. రూ. 700 కోట్ల అంచనా వ్యయంతో ఈ వర్సిటీని నిర్మించనున్నారు. దీనిని 540 మహిళలు, 540 పురుషులు సహా 1,080మంది క్రీడాకారులకు శిక్షణ ఇవ్వగలిగే సామర్థ్యంతో నిర్మించనున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ..ఈ వర్సిటీ మీరట్‌లో స్థానిక క్రీడా ప్రతిభను ప్రపంచవ్యాప్తం చేస్తుందని అన్నారు. అంతేకాకుండా గత ప్రభుత్వాలపై మోదీ (PM Modi) విమర్శలు గుప్పించారు. గతంలో యూపీలో నేరస్థుల ఆటలు సాగాయని అయితే ప్రస్తుతం యోగీ ప్రభుత్వం వారిని జైళ్లకు పంపించి వారితో 'జైల్‌..జైల్‌'’ ఆట ఆడుతోందని పేర్కొన్నారు.




Also Read: Telangana ban potatoes: ఆలుగడ్డలు రాజేసిన రాజకీయ మంట.. తెలంగాణపై యూపీ రైతుల ఆగ్రహం


అంతకుముందు మీరట్ నగరంలోని కాళీ పల్టాన్ మందిర్‌ను (Kali Paltan Mandir) ప్రధాని మోదీ సందర్శించి..ప్రార్థనలు చేశారు. అనంతరం 1857 నాటి మహా తిరుగుబాటు వీరుడు మంగళ్ పాండే విగ్రహానికి (statue of Mangal Pandey) పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం షహీద్ స్మారక్ అమర్ జవాన్ జ్యోతిని సందర్శించి 1857 నాటి అమరవీరులకు నివాళులర్పించారు. ప్రధాని వెంట ఉత్తర ప్రదేశ్‌ గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌ (UP Governor Anandiben Patel), ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ (UP CM Yogi Adityanath) ఉన్నారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook