ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ప్రజలు ఎవరికీ పూర్తి మెజార్టీ ఇవ్వలేదు. మొత్తం 59 స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. కాంగ్రెస్ కు 21 స్థానాలు దక్కాయి. కాగా స్థానిక నేషనల్ పీపుల్స్ పార్టీ 19 స్థానాలు సాధించింది. ఇక్కడ బీజేపీ కేవలం 2 స్థానాలకే పరిమితమైంది. ఇతరులు 11 స్థానాలు సాధించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నాగాలాండ్, త్రిపురలో ఖాతా తెరవకుండా చేదు అనుభవం ఎదుర్కొన్న కాంగ్రెస్ కు ఇక్కడి ఫలితాలు కాస్త ఊరట కల్గిస్తున్నాయి.. అయితే  స్పష్టమైన మెజార్టీ లేకపోవడంతో మళ్లీ ఆ పార్టీ  అధికారాన్ని దక్కించుకోవడం కష్టంగా మారింది. 
 
తోకపార్టీలదే కీలక పాత్ర.


మొత్తం 59 స్థానాలు ఉన్న మేఘాలయలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 30. ఇక్కడ కాంగ్రెస్ కు వచ్చింది కేవలం 21 మాత్రమే. ఇంకా ప్రభుత్వ ఏర్పాటుకు 9 మంది సభ్యుల మద్దతు అవసరం. బీజేపీ ఎలాగో మద్దతు ఇవ్వదు..ఇక మిగిలింది ఇండిపెండెంట్లు,చిన్నాచితక పార్టీలే.. 11 మంది సభ్యుల్లో ఎంతమంది కాంగ్రెస్ కు మద్దతిస్తారనే విషయంపై స్పష్టత రాలేదు..ఈ విషయంలో బీజేపీ చక్రం తిప్పి కాంగ్రెస్ కు అధికారంలోకి రాకుండా చేయాలనే ప్రయత్నాలు మొదలెట్టింది. గోవా పరిణామాలు ఇక్కడ రీపీట్ అవుతాయా? ..లేదంటే రాజనీతి ప్రదర్శించి కాంగ్రెస్ పార్టీయే అధికారం చేపడుతుందా ? అనే దానిపై ఉత్కంఠత నెలకొంది. 



మొత్తం స్థానాలు 59
మేజిక్ ఫిగర్ - 30
కాంగ్రెస్ - 21
ఎన్‌పీపీ - 19
ఇతరులు - 11
బీజేపీ -  02