ఈశాన్య భారతదేశంలోని మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు నేడు వెలువడ్డాయి. త్రిపుర, నాగాలాండ్‌, మేఘాలయ రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఈ రోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఇందుకోసం ఎలక్షన్ కమీషన్ అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. త్రిపురలో ఫిబ్రవరి 18వ తేదీన, నాగాలాండ్‌, మేఘాలయల్లో ఫిబ్రవరి 27 తేదీన ఎన్నికలు జరిగాయి. ఈ మూడు రాష్ట్రాల్లో 60 చొప్పున అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కాకపోతే పలు కారణాల వలనల 3 రాష్ట్రాల్లో 59 స్థానాల చొప్పున మాత్రమే పోలింగ్‌ జరగడం గమనార్హం. ప్రస్తుతం మూడు రాష్ట్రాల్లో సత్తా చాటిన భాజాపా మరో 3 రాష్ట్రాల్లో గెలవాలని బలమైన కోరికతో ఉంది. సీపీఎం, భాజపా మధ్య ప్రధానమైన పోటీ వాతావరణం నెలకొని ఉంది. 


కాగా భాజాపా సత్తా చాటే అవకాశం ఉందని ఎగ్జిట్‌ పోల్స్‌ చెబుతున్నాయి. 25 ఏళ్లుగా త్రిపురలో సీపీఎం అధికారంలో ఉంది. మేఘాలయలో పదేళ్లుగా కాంగ్రెస్‌ పాలనలో ఉండగా.. నాగాలాండ్‌లో నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌ 2003 నుంచి ప్రభుత్వంలో ఉంది. ఇప్పటికే అస్సాం, మణిపుర్‌, అరుణాచల్‌ప్రదేశ్‌లలో సత్తా చాటిన భాజపా ఈశాన్య ప్రాంతంలో పాగా వేసే అవకాశం ఉందనేది సమాచారం. త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌లలో 60 చొప్పున అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.


గతంలో త్రిపురలో సీపీఎం అభ్యర్థి ఒకరు మృతి చెందగా.. మేఘాలయలో  ఎన్‌సీపీ అభ్యర్థి తీవ్రవాదుల దాడిలో చనిపోయారు.  ఈ రెండు చోట్ల ఎన్నిక వాయిదాపడింది. కాగా నాగాలాండ్‌లో ఎన్‌డీపీపీ అధ్యక్షుడు నెయిఫుయు రియో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇలా వివిధ కారణాలతో 3 రాష్ట్రాల్లోనూ 59 స్థానాల చొప్పునే పోలింగ్‌ జరిగింది. తాజా సమాచారం ప్రకారం అనారోగ్యంతో త్రిపుర రాష్ట్ర మంత్రి, సీపీఎం అభ్యర్థి ఖగేంద్ర జమాతియా(64) ఢిల్లీలోని ఎయిమ్స్‌లో శుక్రవారం మృతి చెందారు. ఇటీవలి ఎన్నికల్లో ఆయన కృష్ణపుర్‌ నుంచి పోటీచేశారు. ఆ స్థానంలో శనివారం ఓట్ల లెక్కింపు యథావిధిగా జరుగుతుంది


రసవత్తరంగా సాగుతున్న కౌంటింగ్ ప్రక్రియ



మేఘాలయలో పూర్తిస్థాయిలో సెక్యూరిటీ మోహరింపు



నాగాలాండ్‌లో కాంగ్రెస్, సీపీఎంలతో పోల్చుకుంటే పుంజుకుంటున్న బీజేపీ 



బీజేపీ త్రిపురలో సత్తా చాటే అవకాశం ఉంది. నాగాలాండ్, మేఘాలయలో కూడా మా పార్టీ బాగా పుంజుకుంది. ఈశాన్య రాష్ట్రాలకు ఇది మంచి పరిణామం: రామ్ యాదవ్, బీజేపీ నేత 



ప్రస్తుత సమాచారం ప్రకారం మేఘాలయలో కాంగ్రెస్ 5 సీట్లలో, యూడీపీ 2 సీట్లలో, ఎన్‌పీపీ 1 సీటులో, స్వతంత్ర అభ్యర్థి 1 సీటులో ఆధిక్యంలో ఉన్నారు. మేఘాలయలో కాంగ్రెస్ 59 స్థానాల్లో, బీజేపీ 47 స్థానాల్లో పోటీ చేసింది. షిల్లాంగ్‌లోని పోలో గ్రౌండ్‌లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతోంది. ఈసారి ఇక్కడ బీజేపీ పాగా వేసే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ తేల్చిన సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్ పుంజుకోవడం పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది 



త్రిపురలో లెఫ్ట్ ఫ్రంట్ సత్తా చాటింది. ధన్ పూర్ ప్రాంతం నుండీ పోటీ చేసిన సీఎం మాణిక్ సర్కార్ గెలిచారు. ఆయన 1998 సంవత్సరం నుంచి త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. మార్చి 2008లో, అతను వామపక్ష ప్రభుత్వానికి నాయకుడిగా ప్రమాణస్వీకారం చేశారు. 2013లో జరిగిన  ఎన్నికలలో అతను వరుసగా నాలుగోసారి సీఎం అయ్యారు. మాణిక్ సర్కార్ తనజీతం మరియు అలవెన్సులను పార్టీకి విరాళంగా ఇచ్చి వార్తలో నిలచారు, ప్రతిగా పార్టీ నుండి జీవనభ్రుతిగా కేవలం 5000 రూపాయలనే జీవనభ్రుతిగా పొందుతున్నారు. 19 సంవత్సరాల వయస్సులోఅతను భారతదేశ కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) లో సభ్యత్వం తీసుకున్నారు.  23 ఏళ్ల వయసులో 1972 లో సి.పి.ఎం రాష్ట్ర కమిటి సభ్యులుగా ఎన్నిక అయ్యారు.



త్రిపురలో లెఫ్ట్ పార్టీల గెలుపు ఖాయమని సీపీఐ (ఎం) నేత బృందా కారత్ అభిప్రాయపడ్డారు. త్రిపురలో  లెఫ్ట్ అభ్యర్థి చనిపోయిన కారణంగా చారిలాం అసెంబ్లీ స్థానానికి మార్చి 12న పోలింగ్ నిర్వహించారు. అప్పుడు వామపక్ష నేతలు సీతారాం ఏచూరి, బృందా కారత్ తదితరులు ప్రచారం నిర్వహించారు. సీపీఎం, బీజేపీలతో పోలిస్తే కాంగ్రెస్ ప్రచారం చాలా తక్కువగా జరిగింది. మొత్తం 60 స్థానాలకుగాను 307 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. సీపీఎం 57 స్థానాలకు పోటీచేస్తుండగా ఇతర పార్టీలైన ఆర్‌ఎస్పీ, ఫార్వర్డ్‌బ్లాక్, సీపీఐలు ఒక్కోస్థానం నుంచి పోటీలో నిలిచాయి. 



త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్.. ఈ మూడు రాష్ట్రాల్లో బీజేపీనే తన హవా కొనసాగిస్తుందని.. ఆ పార్టీయే ఈ ఎన్నికల్లో విజయపతాకం ఎగురువేస్తుందని.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజ్జు అభిప్రాయపడ్డారు. గతంలో అరుణాచల్ ప్రదేశ్ నుండి ఆయన లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఎలాగైతే అరుణాచల్ ప్రదేశ్‌లో బీజేపీ సత్తా చాటిందో.. అదే మళ్లీ ఈ మూడు రాష్ట్రాల్లో రిపీట్ అవుతుందని కిరణ్ రిజ్జు తెలిపారు. ఇదే అభిప్రాయాన్ని త్రిపురలోని బీజేపీ నేత హిమంత బిశ్వా శర్మ కూడా వెల్లిబుచ్చారు.  



త్రిపుర ఎన్నికల్లో బీజేపీ గెలుపు దిశగా వెళ్తుందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఆ పార్టీ 32 సీట్లలో ఆధిక్యంలో ఉంది. అలాగే సీపీఎం 27 స్ఠానాల్లో ముందంజలో ఉండి గట్టి పోటీ ఇస్తోంది. కాంగ్రెస్, సీపీఐ ఎలాంటి ఖాతా తెరవకపోవడం గమనార్హం. 



మేఘాలయలో కాంగ్రెస్ అభ్యర్థి, ఆ రాష్ట్ర సీఎం ముకుల్ సంగ్మా సత్తా చాటారు. అంబటి, సోంగ్ సోక్.. ఈ రెండు ప్రాంతాల నుండి పోటీ చేసిన ఆయన ఆ రెండు స్థానాల్లోనూ గెలవడం  విశేషం. ఆయన ప్రస్తుతం మేఘాలయకు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. 1998, 2003, 2008 సంవత్సరాల్లోనే కాకుండా 2013లో కూడా ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. అయితే కడపటి వార్తలు అందేసరికి.. మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు హంగ్ దిశగా సాగుతున్నట్లు సమాచారం. మొత్తం 60 స్థానాలున్న మేఘాలయ అసెంబ్లీలో... 59 స్థానాలకు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్‌ 23 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. 2013లో ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చింది. 2013 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ 29 సీట్లు, యూడీపీ 8, హెచ్సీపీడీపీ 4, ఇత‌రులు 19 సీట్లు గెలుచుకోవడం విశేషం. 



మేఘాలయ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా మవ్ ప్లాంగ్ నియోజకవర్గం నుండి బరిలోకి దిగిన ఎస్ కే సన్ భారీ విజయం సాధించారు. ఆయన ఓ రిటైర్డు ఇంజనీరు. ప్రస్తుతం మేఘాలయ హంగ్ దిశగా వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏ పార్టీకి సరైన మెజారిటీ లేకపోవడమే అందుకు ప్రధాన కారణం. 2013లో కాంగ్రెస్ ఇక్కడ అధికారంలోకి వ‌చ్చింది. ఆ  ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ 29 సీట్లు, యూడీపీ 8, హెచ్సీపీడీపీ 4, ఇత‌రులు 19 సీట్లు గెలుచుకున్నారు. మేఘాల‌య‌లో 60 అసెంబ్లీ స్థానాలతో పాటు రెండు పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేతలు అహ్మద్ పటేల్, కమల్‌నాథ్ శనివారం ఉదయమే షిల్లాంగ్‌కు వెళ్లారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి మేఘాలయలో మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న భాజాపా కడపటి వార్తలు అందేసరికి కేవలం 5 సీట్లతో కొనసాగుతోంది



త్రిపుర రాష్ట్రంలో తొలిసారిగా బీజేపీ గెలవబోతుందని వార్తలు వస్తు్న్న క్రమంలో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం తొంగిచూసింది. వీధుల్లోకి వచ్చి తీన్మార్ స్టైల్‌లో రెచ్చిపోయి డ్యాన్సులు చేయడం ప్రారంభించారు బీజేపీ అభిమానులు. ఇప్పటికే త్రిపుర పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ రామ్ మాధవ్, రాష్ట్ర అధ్యక్షుడు బిప్లాప్ కుమార్ దేవ్ బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద సంబరాల్లో మునిగితేలారు. ఇప్పటి వరకు కమ్యూనిస్టుల కోటగా పేరుగాంచిన త్రిపురలో బీజేపీ హవా కొట్టొచ్చిన్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ అసలు ఇక్కడ ఖాతా కూడా తెరవకపోవడం గమనార్హం.త్రిపుర, నాగాలాండ్‌లలో మిత్రపక్షాల సహాయంతో బరిలోకి దిగిన బీజేపీ తన హవాను తుది వరకూ కొనసాగించింది



త్రిపురలో బీజేపీ విజయాన్ని దక్కించుకుంది. తాజా ఫలితాలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ట్విటర్‌లో తన అభిప్రాయాలు పంచుకున్నారు. ఈశాన్య ప్రాంతాలను డెవలప్ చేయాలన్నమోదీ ఆలోచనలకు త్రిపుర ప్రజలు పట్టం కట్టారని ఆయన తెలిపారు. 



కోటి ఆశలతో ఈశాన్య కురుక్షేత్రంలో అడుగుపెట్టిన బీజేపీకి త్రిపుర ప్రజలు బ్రహ్మరథం పెట్టారు. మిత్రపక్షాలతో కలిసి బీజేపీ బ్రహ్మాండమైన విజయం సాధించింది. వివరాల్లోకి వెళ్లినట్లయితే  మొత్తం 59 స్థానాలకు గాను బీజేపీ కూటమి 42 సీట్లు గెలుచుకుంది. కమ్యూనిస్టు కంచుకోటగా పేరున్న త్రిపురలో వామపక్ష పార్టీలు 17 స్థానాలు మాత్రమే నిలబెట్టుకోగలిగాయి. ఫలితంగా అధికారం పక్షం నుంచి ప్రతిపక్ష పాత్రకు సీపీఎం సిద్ధమైంది. గత 25 ఏళ్లుగా అధికారంలో ఉన్న కమ్యూనిస్టులను ఓడించి కమలం పార్టీ విజయదుందుభి మోగించడంతో ఆ పార్టీ కార్యకర్తలు సంబారాల్లో మునిగి తేలుతున్నారు..కాగా కోటి ఆశలతో ఈశాన్య కురుక్షేత్రంలో అడుగుపెట్టిన కాంగ్రెస్‌కు ఒక్కసీటు కూడా దక్కకపోవడం గమనార్హం. 


మొత్తం స్థానాలు  - 59, బీజేపీ కూటమి - 42, వామపక్షాలు (సీపీఎం) - 17