Lockdown: ఆల్కాహాల్ లేదని శానిటైజర్, షేవింగ్ క్రీమ్ లోషన్ తాగారు
ఆల్కాహాల్‌కి బానిసైన ఓ యువకుడు లాక్ డౌన్ కారణంగా ఆల్కహాల్ లభించడం లేదని శానిటైజర్ తాగి ప్రాణాలు పోగొట్టుకున్న ఘటన తమిళనాడులోని కోయంబత్తూరులో శనివారం చోటుచేసుకుంది. కేరళలోని కుయంకుళంలో మద్యం దొరకడం లేదనే ఆందోళనతో షేవింగ్ క్రీమ్ లోషన్ తాగి ప్రాణాలు కోల్పోయాడు.
కోయంబత్తూరు: ఆల్కాహాల్‌కి బానిసైన ఓ యువకుడు లాక్ డౌన్ కారణంగా ఆల్కహాల్ లభించడం లేదని శానిటైజర్ తాగి ప్రాణాలు పోగొట్టుకున్న ఘటన తమిళనాడులోని కోయంబత్తూరులో శనివారం చోటుచేసుకుంది. స్థానికంగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తోన్న ఈ బెర్నార్డ్ మద్యానికి బాగా బానిసయ్యాడు. కరోనా వైరస్ నివారణ కోసం కేంద్రం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో గత రెండు వారాలుగా మద్యం లభించకపోవడంతో బెర్నార్డ్ పిచ్చి పట్టినట్టుగా తయారయ్యాడు. ఆఖరికి మద్యానికి బదులుగా మద్యంతో తయారు చేసే హ్యాండ్ శానిటైజర్‌ని తాగి స్పృహ కోల్పోయాడు. ఇంట్లో స్పృహ కోల్పోయి పడి ఉన్న బెర్నార్డ్‌ను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతడు మృతి చెందినట్టు అక్కడి వైద్యులు తేల్చిచెప్పారు.
Also read : రేపు లాక్ డౌన్ పొడగింపుపై స్పష్టత
లాక్‌డౌన్ నేపథ్యంలో మద్యం దొరక్క మద్యం ప్రియులు పిచ్చిపట్టినట్టుగా ప్రవర్తిస్తున్న ఘటనలు దేశవ్యాప్తంగా వెలుగులోకొస్తున్నాయి. కేరళలోని కొట్టాయంలో మద్యం దొరకడం లేదని మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి.. భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం అతడు కొట్టాయం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Also read : Earthquake in Delhi: వరుసగా రెండో రోజూ ఢిల్లీని వణికించిన భూకంపం
ఇదిలావుంటే, ఇదే కేరళలోని కుయంకుళంలో మద్యం దొరకడం లేదనే ఆందోళనతో షేవింగ్ క్రీమ్ లోషన్ తాగి ప్రాణాలు కోల్పోయాడు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..