Archana Gautam - Congress Ticket: యూపీ అసెంబ్లీ ఎన్నికలు.. మిస్ బికినీకి టికెట్ ఇచ్చిన కాంగ్రెస్!!
మీరట్‌లోని హస్తినాపూర్ అసెంబ్లీ స్థానానికి మిస్ బికినీ 2018 అయిన అర్చన గౌతమ్‌ను కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఎంపిక చేశారు.
Miss Bikini India 2018 Archana Gautam gets Congress ticket from Hastinapur: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో (UP assembly Polls) 125 స్థానాలకు గాను కాంగ్రెస్ (Congress) జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi Vadra) గురువారం (జనవరి 13) 125 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో కొంతమంది పాత్రికేయులు, ఒక నటి మరియు సామాజిక కార్యకర్తలు ఉన్నారు. ప్రియాంక గాంధీ విడుదల చేసిన అసెంబ్లీ ఎన్నికల జాబితాలో 40 శాతం మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు.
మీరట్ (Meerut)లోని హస్తినాపూర్ (Hastinapur) అసెంబ్లీ స్థానానికి మిస్ బికినీ 2018 అయిన అర్చన గౌతమ్ (Archana Gautam)ను ప్రియాంక గాంధీ వాద్రా ఎంపిక చేశారు. నవంబర్ 2021లో కాంగ్రెస్ పార్టీలో చేరిన మోడల్, నటి అయిన అర్చనకు టికెట్ రావడం విశేషం. మీరట్‌లో జన్మించిన అర్చన వయసు కేవలం 26 ఏళ్లు మాత్రమే. సినీ ప్రపంచంలో మంచి పేరు తెచ్చుకున్నారు. మోడల్, నటి అర్చన గౌతమ్ వృత్తిరీత్యా బికినీ గర్ల్‌గా కూడా చాలా ఫేమస్. అర్చన గౌతమ్‌ని సౌత్ సన్నీ లియోన్ (Sunny Leone) అని కూడా పిలుస్తారు. ఆమెకు చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది.
Also Read: India Covid Cases Today: భారత్‌లో కరోనా పంజా.. రెండున్నర లక్షలకు పైగా కొత్త కేసులు!!
అర్చన గౌతమ్ జర్నలిజం చదివారు. చదువు పూర్తయ్యాక మోడలింగ్, యాక్టింగ్ వైపు వెళ్లారు. అర్చన 2014లో మిస్ యూపీ (Miss UP)గా ఎన్నికయ్యారు. గ్లామర్ ప్రపంచంలో ఆమెకు ఇదే తొలి విజయం. మిస్ బికినీ ఇండియా 2018 అందాల పోటీలో అర్చన విజేతగా నిలిచారు. మిస్ ఉత్తరప్రదేశ్ 2014, మిస్ కాస్మో ఇండియా 2018తో సహా అనేక టైటిల్స్ అర్చన సొంతం చేసుకున్నారు. అడల్ట్ మూవీ 'గ్రేట్ గ్రాండ్ మస్తీ'తో అర్చన బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. తమిళం, హిందీ మరియు తెలుగు సినిమాలలో కూడా ఆమె నటించారు. సథియా సాథ్ నిభానా, కుబూల్ హై, సీఐడీ లాంటి టీవీ సీరియల్స్‌లో కూడా అర్చన నటించారు.
గతేడాది నవంబర్‌లో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ సమక్షంలో అర్చన గౌతమ్ కాంగ్రెస్‌లో చేరారు. ప్రియాంక వాద్రా చేస్తున్న 'గర్ల్ హూన్, లడ్ సక్తి హూన్' ప్రచారానికి ప్రభావితమై రాజకీయాల్లోకి వచ్చానని అర్చన చెప్పారు. 2012లో హస్తినాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి గోపాల్ కాళి పోటీ చేశారు. ఆ సమయంలో ఆర్‌ఎల్‌డీతో కాంగ్రెస్ (Congredd) పొత్తు పెట్టుకుంది. 2017లో పొత్తు కారణంగా హస్తినాపూర్ సీటు ఎస్పీ (SP) ఖాతాలోకి వెళ్లింది. పదేళ్ల తర్వాత కాంగ్రెస్ మహిళా అభ్యర్థిని బరిలోకి దింపింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి