Miss World 2024 Winner: మిస్‌ వరల్డ్‌-2024 కిరీటాన్ని చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన క్రిస్టినా పిస్కోవా (Krystyna Pyszkova) దక్కించుకుంది. 28 సంవత్సరాల తర్వాత భారత్ వేదికగా ఈ మిస్ వరల్డ్  పోటీలు జరిగాయి. ఈ 71వ ఎడిషన్‌ గ్రాండ్ ఫినాలే వేడుకలకు ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌ ఆతిథ్యమిచ్చింది. ఈ పోటీల్లో వేడుకలో 112 దేశాలకు చెందిన అందాల భామలు పోటీ పడ్డారు. క్రిస్టినా పిస్కోవా (చెక్‌ రిపబ్లిక్‌), యాస్మిన్‌ అజైటౌన్‌ (లెబనాన్‌), అచే అబ్రహాంస్‌ (ట్రినిడాడ్‌ అండ్‌ టుబాగో), లీసాగో చోంబో (బోట్స్వానా)లు టాప్‌-4లో నిలిచారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ పోటీల్లో భారత్‌కు మరోసారి నిరాశ ఎదురైంది. మన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కన్నడ భామ సినీశెట్టి టాప్‌-8కే పరిమితమయింది. సినీశెట్టి ఫెమినా మిస్ ఇండియా 2022 విజేత నిలిచిన సంగతి తెలిసిందే. చివరి వరకూ ఉత్కంఠగా  సాగిన ఈ మిస్ వరల్డ్ పోటీల్లో విన్నర్ గా క్రిస్టినా, రన్నరప్‌గా లెబనాన్‌కు చెందిన అజైటౌన్‌ నిలిచారు. ఈ కార్యక్రమంలో రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ మరియు వ్యవస్థాపకురాలు నీతా అంబానీ మిస్‌ వరల్డ్‌ హ్యుమానిటేరియన్‌ అవార్డును అందుకున్నారు. మిస్‌ వరల్డ్‌ ఆర్గనైజేషన్‌ ఛైర్‌ ఉమెన్‌ జూలియా మోర్లీ ఈ అవార్డును ఆమెకు ప్రదానం చేశారు. నీతా అంబానీ చేస్తున్న స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు ఈ అవార్డు దక్కింది. ఈ అవార్డు వేడుకలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా జోనాస్ వీడియో సందేశాన్ని అందించారు. 



Also Read: Actor Sivaji: మీసాలు తీసేసి.. వేషం మార్చి దుబాయ్‌లో దొరికిపోయిన శివాజీ.. అలీ అడిగిన ప్రశ్నతో..!


Also Read: AP Elections 2024: మార్చ్ 17న మూడు పార్టీల ఉమ్మడి సభ, మోదీ హాజరుకానున్నారా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి