19 Lakhs Worth Cell Phone Tower Stolen In Bihar: డబ్బు, బంగారం, ఇంట్లోని సామాను లాంటివి.. దొంగలు దొంగతనం చేస్తారని మనం అందరం నిత్యం వింటూనే ఉంటాం. మొన్న బీహార్‌లో స్టీల్ బ్రిడ్జీనే ఎత్తుకెళ్లిన ఘటన కూడా ఉంది. కానీ మొబైల్ టవర్ దొంగతనం గురించి ఎప్పుడైనా విన్నారా?. అదీ పట్టపగలే అందరూ చూస్తుండగానే చోరీ చేసిన ఘటన బిహార్‌లో చోటుచేసుకుంది. మొబైల్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ అధికారులుగా వచ్చిన దొంగల ముఠా.. సెల్‌ టవర్‌ విడి భాగాలుగా చేసి ఎత్తుకెళ్లింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాల ప్రకారం... పట్నా గార్డెన్‌బాగ్‌లోని కచ్చి తలాబ్‌ ప్రాంతంలో చాలా ఏళ్ల క్రితం (15) నుంచి ఓ సెల్‌ టవర్‌ ఉంది. ఆ సెల్‌ టవర్‌కు కొన్ని నెలలుగా ఓ కంపెనీ అద్దె చెల్లించడం లేదు. ఈ విషయం తెలుసుకున్న 10-15 మందితో కూడిన ఓ దొంగల ముఠా టవర్‌ను దొంగిలించడానికి ప్రణాళిక వేశారు. ఇందులో భాగంగానే సెల్ టవర్‌ ఉన్న స్థలం యజమానితో ముందుగానే కొందరు దొంగలు మాట్లాడారు. తాము టవర్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ అధికారులమని, కంపెనీ నష్టాల్లో ఉన్నందున అద్దె చెల్లించలేకపోతున్నామని స్థలం యజమానితో చెప్పారు.


సెల్‌ఫోన్‌ టవర్‌ను 2-3 రోజుల్లో వచ్చి తీసుకెళుతామని స్థలం యజమానితో దొంగల ముఠా సభ్యులు చెప్పారు. దాంతో స్థలం యజమాని వారికి ఓకే చెప్పాడు. చెప్పినట్టే రెండు రోజుల తర్వాత దొంగల ముఠా సభ్యులు వచ్చి.. పట్టపగలే అందరూ చూస్తూండగానే 2-3 రోజులలో టవర్‌ను నేలమట్టం చేశారు. ఆపై విడి భాగాలను ఓ ట్రక్కులో వేసుకుని వెళ్లిపోయారు. విషయం తెలుకున్న సెల్‌ టవర్‌ అధికారులు స్థలం యజమానిని అడగ్గా.. అతడు అంతా వివరించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


గార్డినీబాగ్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఫిర్యాదు ప్రకారం.. టవర్‌ను కూల్చివేసేందుకు దాదాపు 25 మంది దొంగల ముఠా సెల్‌ఫోన్‌ టవర్‌ వద్దకు వచ్చారట. పెద్ద పెద్ద సుత్తెలు మరియు గ్యాస్ కట్టర్‌ లాంటి ఆయుధాలతో సంఘటనా స్థలానికి వచ్చారట. శనివారం ఈ ఘటన చోటుచేసుకోగా.. ఆదివారం కేసు నమోదు అయింది. 19 లక్షల రూపాయల విలువైన మొబైల్ టవర్‌ను దొంగలు దోచుకున్నారని సెల్‌ఫోన్‌ టవర్‌ కంపెనీ అధికారులు చెప్పారు. 


Also Read: 2022 IPL final: గిన్నీస్‌ రికార్డు సాధించిన ఐపీఎల్‌ 2022 ఫైనల్ మ్యాచ్‌.. ఎందుకంటే?


Also Read: Bandi Sanjay: బీజేపి కార్యకర్తలను కాళ్లతో తన్నిన ఎసై కిషోర్.. నా ముందే హింసించారు..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook.