Cyclone Mocha: బంగాళాఖాతంలో తుఫాన్, ఈ రాష్ట్రాలపై మోకా ఎఫెక్ట్!
Mocha Cyclone Date 2023: బంగాళాఖాతంలో ఏర్పడబోతున్న మోకా తుఫాన్ వల్ల పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు వెళ్లడించారు. అయితే ఈ తుఫాన్ ప్రభావం ఏయే రాష్ట్రాలపై పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Mocha Cyclone Date 2023: ఆంధ్ర, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో అకాల వర్షాలు విస్తారంగా పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులులతో కూడిన వడగళ్ల వాన ముంచెత్తడం వల్ల రైతుల చేతికి వచ్చిన పంట తీవ్రంగా నష్టపోయారు. మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసి ఆస్తి నష్టం జరిగింది. అయితే గత మూడు రోజుల నుంచి వాతావరణంలో మార్పులు రావడం కారణంగా వర్షాలు తగ్గుముఖం పట్టాయి. వానలు తగ్గి రెండు రోజు కాకముందే బంగాళాఖాతంలో తుఫాన్ హెచ్చరికలు అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.
భారత వాతవరణ అధికారులు వెళ్లడించిన వివరాల ప్రకారం..మే 6వ నెల ఉపరితల ఆవర్తనం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడి.. ఇది 7వ తేది అల్పపీడనంగా మారే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆ తర్వాతి రోజు వాయుగుండంగా బలపడబోతోందని అధికారులు తెలిపారు. ఈ నెల 9వ తేదినగా తుఫాన్‌గా రూపం దాల్చనుంది. అయితే అధికారులు ఈ తుఫాన్‌కి మోకా అని పేరు కూడా పెట్టారు.
Also read: Shani Jayanti 2023: శని జయంతి రోజు ఈ ఉపాయాలు పాటిస్తే శని దోషం, దుష్ప్రభావాల్నించి ఉపశమనం
బంగాళాఖాతంలో మోకా తుఫాన్ ఏర్పడబోతోందని తెలియగానే ఏపీలో సముద్ర తీర ప్రాంత ప్రజల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ ఏర్పడబోయే తుఫన్ కారణంగా ఎంత మొత్తంలో ఆస్తి, పంట నష్టం జరుగుతుందోనని ఆందోళన పడుతున్నారు. ఇదే క్రమంలో భారత వాతావరణ శాఖ కీలక సమాచారాన్ని తీర ప్రాంత ప్రజలకు వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడే మోకా తుఫాన్ తెలుగు రాష్ట్రాలపై అంతగా ప్రభావం ఉండకపోవచ్చన్నారు. ఈ తుఫాన్ ఉత్తర ఈశాన్యంగా మీదుగా.. మయన్మార్, బంగ్లాదేశ్ దిశగా వెళ్లే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు.
ఈ క్రమంలో తెలంగాణ, ఏపీ, ఒడిశాకు ఎలాంటి మోకా తుఫాన్ ముప్పు ఉండకపోవచ్చని వాతావరణ నిపుణులు వెల్లడించారు. అయితే వచ్చే రెండు, మూడు రోజుల్లో ఆకల వర్షాలు పడే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వచ్చేవారంలో పలు చోట్ల వర్షం పడే ఛాన్స్ ఉంది. మే 9 నుంచి ఆంధ్ర ప్రదేశ్‌లో మళ్లి ఎండలు పెరుగుతాయని వాతావరణ నిపుణులు తెలిపారు.
Also read: Shani Jayanti 2023: శని జయంతి రోజు ఈ ఉపాయాలు పాటిస్తే శని దోషం, దుష్ప్రభావాల్నించి ఉపశమనం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook