Modi govt’s big festive bonanza for Railway employees: రైల్వే ఉద్యోగులకు కేంద్రం శుభవార్త చెప్పింది. నాన్‌ గెజిటెడ్‌ రైల్వే ఉద్యోగుల(Railway Employees)కు 78 రోజుల వేతనాన్ని ఈ ఏడాది బోనస్‌(Bonus)గా ఇవ్వాలని నిర్ణయించింది. కేంద్ర కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల 11.56 లక్షల మంది ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. ప్రభుత్వ ఖజానాపై రూ.1985 కోట్ల మేర భారం పడనుంది. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీ(PM Modi) అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశంలో బుధవారం ఈ నిర్ణయం తీసుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: ప్రధాని, ఆర్థిక మంత్రితో ఇండియన్‌ బిగ్‌బుల్‌ భేటీ..నలిగిన చొక్కాతో ఝున్‌ఝున్‌వాలా..



 రైల్వే ఉద్యోగులకు బోనస్‌ సహా పలు అంశాలను ఈ భేటీలో చర్చించారు. కేబినెట్‌ భేటీ అనంతరం కేంద్రమంత్రులు అనురాగ్‌ ఠాకూర్‌(Union Minister Anurag Thakur), పీయూష్‌ గోయాల్‌ మీడియా సమావేశంలో కేబినెట్‌ నిర్ణయాలను వెల్లడించారు. మహమ్మారి కారణంగా దెబ్బతిన్న పరిశ్రమలను తిరిగి గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.



టెక్స్‌టైల్ పార్క్‌ల ఏర్పాటుకు రూ .4,445 కోట్లు
దేశవ్యాప్తంగా 7 మెగా ఇంటిగ్రేటెడ్‌ టెక్ట్స్‌టైల్‌ రీజియన్‌ అండ్‌ అపెరల్ (పీఎం-మిత్ర) పార్కుల ఏర్పాటుకు సైతం కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌(Union Commerce Minister Piyush Goyal)  వివరించారు. రాబోయే ఐదేళ్లలో రూ.4,445 కోట్లతో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయంతో 7 లక్షల మందికి ప్రత్యక్షంగాను.. 14 లక్షల మందికి పరోక్షంగానూ ఉపాధి అవకాశాలు లభించనున్నాయని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పీపీపీ పద్ధతిలో పీఎం మిత్ర(PM MITRA) పార్కులను అభివృద్ధి చేయనున్నాయని తెలిపారు. ఇప్పటికే 10 రాష్ట్రాలు వీటి ఏర్పాటుకు ఆసక్తి చూపించాయని గోయల్‌ వెల్లడించారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook