భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎట్టకేలకు మెట్రోరైలు ప్రారంభించారు. మియాపూర్‌లో మెట్రోరైలు పైలాన్‌ను ఆవిష్కరించారు. ఆ తర్వాత మెట్రోరైలు గురించి తెలిపే ఒక ప్రత్యేక వీడియో ప్రజెంటేషన్‌ను ఆయన వీక్షించారు. తెలంగాణ సీఎం కేసీఆర్, గవర్నర్ నరసింహన్‌తో కలిసి ఆయన ఆ ప్రజెంటేషన్‌ను చూశారు. "మై సిటీ.. మై మెట్రో..మై ప్రైడ్" అనే శీర్షికతో ప్రారంభమైన ప్రజెంటేషన్‌ను ఆద్యంతం ఆసక్తిగా తిలకించారు మోడీ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



 


ఆ తర్వాత మోడీ, సీఎం కేసీఆర్‌తో కలిసి మియాపూర్ నుండి కూకట్ పల్లికి మెట్రోలో ప్రయాణించారు.  24 స్టేషన్లను కవర్ చేసే ఈ మెట్రో మియాపూర్ ప్రాంతం నుండి బయలుదేరి, జెఎన్‌టీయూ, కేపీహెచ్బీ, కూకట్ పల్లి, బాలానగర్, మూసాపేట, భరతనగర్, ఎర్రగడ్డ, ఈఎస్ఐ, ఎస్సార్ నగర్, అమీర్ పేట, బేగం పేట, ప్రకాష్ నగరు, రసూల్ పుర, పారడైజ్, పారడైజ్ గ్రౌండ్, సికిందరాబాద్ ఈస్ట్, మెట్టుగూడ, తార్నక, హబ్సీగూడ, ఎన్జీఆర్‌ఐ, స్టేడియం, ఉప్పల్, నాగోలు ప్రాంతాలను మెట్రో కవర్ చేస్తోంది.