భారత ప్రధాని నరేంద్ర మోదీ త్రిపురలోని శాంతి బజార్‌లో జరిగిన బహిరంగ సభలో పాల్గొని ప్రజలతో తన అభిప్రాయాలను పంచుకున్నారు. "మేము తయారుచేయదలిచే నవీన భారతదేశంలో భాగంగా త్రిపుర రాష్ట్రాన్ని కూడా ఆధునికత వైపు మళ్లించేందుకు ప్రయత్నిస్తాము" అని ఆయన తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అదేవిధంగా ఆయన కమ్యూనిస్టు పార్టీలపై కూడా గళమెత్తారు. కమ్యూనిస్టు పార్టీలకు గణతంత్రం మీద నమ్మకం లేదని.. వారు గన్ తంత్రాన్ని, హింసను నమ్ముతారని మోదీ తెలిపారు. అభివృద్ది దిశగా పయనించాలని భావించే త్రిపుర వాసులు బీజేపీకే ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు.


దేశం మొత్తం ఏడవ వేతన కమీషన్ అమలు అవుతుంటే.. త్రిపురలో ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నాలుగవ వేతన కమీషన్ వర్తింపజేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. 25 సంవత్సరాలు పాలించిన కమ్యూనిస్టు పార్టీ త్రిపురను సర్వనాశనం చేసిందని మోదీ తెలిపారు.