బడ్జెట్ 2018 పై ప్రధాని మోదీ ప్రసంగ విశేషాలు
బడ్జెట్ 2018ని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశబెట్టాక.. మీడియా కోసం భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా తాజా బడ్జెట్ పై తన అభిప్రాయాలు పంచుకున్నారు. అందులో ముఖ్యమైన అంశాలు మీకోసం
బడ్జెట్ 2018ని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశబెట్టాక.. మీడియా కోసం భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా తాజా బడ్జెట్ పై తన అభిప్రాయాలు పంచుకున్నారు. అందులో ముఖ్యమైన అంశాలు మీకోసం
*ఈ బడ్జెట్ రైతులకు, సామాన్యులకు, వ్యాపారులకు కూడా ఎంతో లాభదాయకంగా ఉండడం విశేషం
*ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీల నుండి ఫైబర్ ఆప్టిక్స్ వరకూ, రోడ్ల నుండి షిప్పింగ్ వరకు, యువత నుండి సీనియర్ సిటిజన్స్ వరకు, గ్రామీణ్ భారత్ నుండి ఆయుష్మన్ భారత్ వరకు, డిజిటల్ ఇండియా నుండి స్టార్టప్ ఇండియా వరకు అన్ని ఆకాంక్షలను నెరవేర్చింది
*ఈ బడ్జెట్ తప్పకుండా భారత ఆర్థిక పురోగతికి ఎంతగానో ఉపయోగపడుతుంది
*రైతులకు తాము అందించే ఉత్పత్తులకుగాను కనీస ధర లభించేలా ఈ బడ్జెట్‌లో ప్రతిపాదనలు చేసిన ఆర్థికమంత్రికి నా అభినందనలు
*ఉజ్వల యోజన దారిద్య్ర రేఖకు (బీపీఎల్) దిగువన ఉన్న కుటుంబాలకు చెందిన మహిళలకు ఉచితం ఎల్పిజి కనెక్షన్లను కల్పించడానికి శ్రీకారం చుట్టడం నిజంగా గొప్ప ఆలోచన. మా ప్రభుత్వం మహిళలకు చేస్తున్న సేవకు ఇదే గొప్ప ఉదాహరణ
*ఈ బడ్జెట్ రూరల్ ఇండియాకి మరిన్ని అవకాశాలు తీసుకొని వస్తుంది
*ఆపరేషన్ గ్రీన్ ద్వారా రైతులకు మేలు జరుగుతుంది. వారి ఉత్పత్తులకు మంచి ధరలు పలుకుతాయి.
*ఈ బడ్జెట్ ద్వారా రైతులే కాదు, దళితులు, గిరిజనులకు కూడా ఎంతో మేలు జరుగుతుంది. వారికి మరిన్ని అవకాశాలు లభిస్తాయి.
*మేము తీసుకొస్తున్న ఫ్లాగ్ షిప్ హెల్త్ స్కీమ్ దాదాపు 10 కోట్ల పేద కుటుంబాలకు మేలు చేకూరుస్తుంది.