Monkey saves 6 years old girl in uttar Pradesh baghpat: కోతులు ఇప్పటి వరకు ఇళ్ల మీద పడి మనుషుల్ని ఇబ్బందులు పెడుతున్నాయి. అంతేకాకుండా.. పంటపోలాలను నాశనం చేస్తున్నాయి. మామిడి పండ్లు, ఇతర పండ్లను కూడా తింటూ నానా రభస చేస్తున్నాయి. కొంత మందిపై దాడులు చేసి ప్రాణాలు సైతం తీశాయని వార్తలు చూశారు. మరికొన్నిసార్లు కోతుల వల్ల కొంత మంది గ్రామాలు సైతం వదిలేసి మరోచోటికి వెళ్లిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే.. కోతులను పట్టుకునేందుకు చాలా మంది డబ్బులు కూడా ఖర్చులు చేస్తున్నారు. కొండెంగలు, వలలతో కోతుల్ని బంధించిన అడవులు ఉన్న చోట వదిలేస్తున్నారు. కానీ ఇక్కడ కోతులు మాత్రం ఒక బాలికను అత్యాచారం నుంచి కాపాడాయి. అంతేకాకుండా.. బాలికపై అఘాయిత్యానికి ట్రై చేసిన కామాంధుడ్ని పరుగులు పెట్టించాయి. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని  బాగ్ పత్ లో చోటు చేసుకుంది.


పూర్తి వివరాలు..


చాలా మంది ఆంజనేయ స్వామిని దైవంగా కొలుస్తారు. భయమేసిన, ఎలాంటి చెడు కలలు పడిన మొదట హనుమంతిడినే కొలుచుకుంటారు. అయితే.. హనుమంతుడు రామయ్య భక్తుడు. ఆయనను కోలిచే భక్తులకు ఎల్లప్పుడు అండగా ఉంటారని చెప్తుంటారు. ఇదిలా ఉండగా.. ఉత్తర ప్రదేశ్ లోని.. బాగ్ పాత్ లో షాకింగ్ ఘటన  చోటుచేసుకుంది. ఒక యువకుడు.. ఆరేళ్ల బాలికకు మాయమాటలు చెప్పి పాడుపడ్డ భవనంలోకి తీసుకొచ్చాడు. అక్కడ ఆమె దుస్తులు తీసి అత్యాచారానికి ప్రయత్నించాడు.


బాలిక కాపాడాలని పెనుగులాడినట్లు తెలుస్తోంది. ఇంతలో అక్కడే ఉన్న కోతులు.. వెంటనే కామంధుడికి పై దాడికి దిగాయి. అంతేకాకుండా.. కామాంధుడ్ని కోతులు గ్యాంగ్ ముప్పుతిప్పలు పెట్టింది. ఈ నేపథ్యంలో బాలిక మెల్లగా తప్పించుకుని తన ఇంటికి వెళ్లింది. జరిగిన ఘోరాన్ని తన వాళ్లకు చెప్పుకుంది. దీంతో వెంటనే పోలీసుల దగ్గరకు వెళ్లారు.


అక్కడి సీసీ కెమెరాలో ఒక యువకుడు బాలికను తీసుకెళ్తున్నట్లు రికార్డు అయ్యింది. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు . అదే విధంగా కోతులు తనను కాపాడాయని బాలిక , తనవాళ్లతో చెప్పింది.దీంతో కోతుల రూపంలోఆ దేవుడు తమ బాలికను కాపాడారంటూ కూడా స్థానికులు మాట్లాడుకుంటున్నారు.


Read more: Viral video: వావ్.. నెలల పసికందును అమ్మలా లాలించిన ఆవు.. ముచ్చట పడుతున్న నెటిజన్‌లు.. వీడియో వైరల్..


గతంలో నిందితుడు బాలికను చంపుతానని బెదిరించినట్లు తెలుస్తోంది. సమయానికి కోతులు అక్కడకు రాకపోయి ఉంటే నా కుమార్తె చనిపోయి ఉండేదని, బాలిక ఫ్యామిలీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పోలీసులు.. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు సైతం నమోదు చేసి విచారణ చేపట్టారు.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.